తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గాల్లో రాళ్లు కలకలం..

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని 4 గ్రామాల్లో గత కొన్ని రోజులుగా చీకటి పడితే చాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళ తలుపులు తట్టి , ఇళ్లపై రాళ్లుతో దాడి చేస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని ఆదుపులోకి తీసుకున్నారు. అయితే మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి ఆ గ్రామాల్లోని ఇళ్లపై రాళ్ల దాడి జరిగింది. ఠాణేలంక పంచాయతీ పరిధి శీలం వారి మెరకలో పలు ఇళ్లపై రాళ్ల దాడి […]

తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గాల్లో రాళ్లు కలకలం..
Follow us

|

Updated on: May 24, 2020 | 10:09 PM

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని 4 గ్రామాల్లో గత కొన్ని రోజులుగా చీకటి పడితే చాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళ తలుపులు తట్టి , ఇళ్లపై రాళ్లుతో దాడి చేస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని ఆదుపులోకి తీసుకున్నారు. అయితే మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి ఆ గ్రామాల్లోని ఇళ్లపై రాళ్ల దాడి జరిగింది.

ఠాణేలంక పంచాయతీ పరిధి శీలం వారి మెరకలో పలు ఇళ్లపై రాళ్ల దాడి జరగడంతో.. గ్రామస్తులు అందరూ కూడా కర్రలు పట్టుకుని ఆ అజ్ఞాత వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న ముమ్మిడివరం ఎస్.ఐ.పండుదొర సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతుండగా.. గ్రామస్తులు మాత్రం ఇది దుష్ట శక్తుల పనేనని ఆందోళన చెందుతున్నారు.