ఏపీలో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచే దిశగా ముందడుగు, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ- పట్టణాభివృద్ధిశాఖ మధ్య ఎంఓయూ

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించే చర్యల్లో మరో ముందడుగుపడింది. ఇకమీదట మున్సిపల్‌ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు..

ఏపీలో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచే దిశగా ముందడుగు, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ- పట్టణాభివృద్ధిశాఖ మధ్య ఎంఓయూ
Follow us

|

Updated on: Jan 07, 2021 | 6:46 PM

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించే చర్యల్లో మరో ముందడుగుపడింది. ఇకమీదట మున్సిపల్‌ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం శిక్షణ అందించనుంది. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధిశాఖ మధ్య అవగాహన ఒప్పంద పత్రం(ఎంఓయూ)పై సంతకాలు జరిగాయి. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సౌత్‌ ఏషియా రీజనల్‌ డైరెక్టర్‌ టి కె అరుణాచలం అనంతరం పరస్పరం దస్త్రాలు మార్చుకున్నారు.