‘ న్యాయానికి ఇది ఓ ముందడుగు మాత్రమే ‘.. నిర్భయ తల్లి

నిర్భయ కేసులో దోషులైన నలుగురిలో ఒకరికి మరణశిక్షను ధృవీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు.’ ఇదెంతో సంతోషకరమని, న్యాయం జరగడానికి మనం ఒక అడుగు ముందుకు వేసినట్టేనని ‘ ఆమె అన్నారు. బుధవారం కోర్టు తీర్పు ప్రకటించిన అనంతరం బయటకు వచ్చి .. మీడియాతో మాట్లాడిన నిర్భయ తలిదండ్రులు… దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ మీద కోర్టు వెలిబుచ్చిన నిర్ణయం.. తమలో ఇంకా భయాన్ని […]

' న్యాయానికి ఇది ఓ ముందడుగు మాత్రమే '.. నిర్భయ తల్లి
Follow us

|

Updated on: Dec 18, 2019 | 3:35 PM

నిర్భయ కేసులో దోషులైన నలుగురిలో ఒకరికి మరణశిక్షను ధృవీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు.’ ఇదెంతో సంతోషకరమని, న్యాయం జరగడానికి మనం ఒక అడుగు ముందుకు వేసినట్టేనని ‘ ఆమె అన్నారు. బుధవారం కోర్టు తీర్పు ప్రకటించిన అనంతరం బయటకు వచ్చి .. మీడియాతో మాట్లాడిన నిర్భయ తలిదండ్రులు… దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ మీద కోర్టు వెలిబుచ్చిన నిర్ణయం.. తమలో ఇంకా భయాన్ని పూర్తిగా తొలగించలేదని వ్యాఖ్యానించారు. ఇది.. భయంతోనూ, హృదయభారంతోను కూడిన మా ప్రయాణంలో ఒక భాగమే అని వారు వ్యాఖ్యానించారు. తమ కూతురిపై దారుణంగా అత్యాచారం చేసిన రేపిస్టులను ఉరి తీసేవరకు ఈ మా ప్రయాణం పరిసమాప్తం కాదు అని వారు పేర్కొన్నారు.’ ముందు ముందు ఏం జరుగుతుందో మాకు తెలియదు.. ప్రతి సెకండ్ కూడా ఓ కష్ట కాలమే.. దోషులను ఉరి తీసినప్పుడే ఈ జర్నీ ముగుస్తుంది ‘ అని భావోద్వేగంతో పేర్కొన్నారు. తాము ఏడేళ్లుగా ఈ ‘ యుధ్ధం ‘ చేస్తున్నామని ఆశాదేవి గుర్తు చేశారు. ఇది దాదాపు ముగింపు దశకు వచ్చిందని.. తామే కాక.. ఇండియాలోని మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి తీర్పు కోసం వేచి ఉన్నారని.. వాళ్లంతా తమకు కూడా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారని ఆమె అన్నారు. అటు-ఈ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్.. బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని కోర్టు పట్టించుకుందా అన్నరీతిలో ప్రశ్నించాడు. తాను క్షమాభిక్షకు .అర్హుడినని, తనను ఈ కేసులో ఇరికించేందుకు ‘ చాలా ఉత్సాహం ‘ చూపారని ఆరోపించాడు. ‘ ఢిల్లీ కాలుష్యంతో కూడిన ఓ గ్యాస్ ఛాంబర్.. జీవితం చాలా చిన్నది.. అలాంటప్పుడు మరణశిక్ష ఎందుకు ‘ అని కూడా ప్రశ్నించాడు. ఈ దోషి రివ్యూ పిటిషన్ పై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఇతడు ఎలాంటి క్షమాభిక్షకూ అర్హుడు కాడని అన్నారు. ఈ విధమైన కిరాతకుడ్ని సృష్టించిన దేవుడు కూడా సిగ్గు పడాలి అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. కొన్ని నేరాలు మానవాళికంతటికీ శోకాలు తెప్పిస్తాయని, అలాంటి నేరాల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా.. ఈ కేసులో మరో ముగ్గురు దోషులైన ముకేష్ , పవన్ గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్లను కోర్టు గతంలోనే కొట్టివేసింది. రామ్ సింగ్ అనే దోషి ఆత్మహత్య చేసుకోగా.. మైనర్ అయిన వ్యక్తి ని రీఫామ్ హోం లో మూడేళ్లు ఉంచాక విడుదల చేశారు.

.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..