ఇండియాలో అత్యాచారాలు .. షాకింగ్ డీటెయిల్స్ !

హైదరాబాద్ లో దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. పోలీసుల చర్యపట్ల దిశ కుటుంబంతో బాటు అనేకమంది సెలబ్రిటీలతో సహా హర్షం ప్రకటిస్తున్నారు. అయితే ఇండియాలో ఇలాంటి కేసుల వివరాల్లోకి ఒక్కసారి వెళ్తే.. ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ దేశంలో 2017 లో 32, 500 కు పైగా రేప్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. రోజుకు ఇవి సుమారు 90 కేసులవరకు ఉన్నట్టు […]

ఇండియాలో అత్యాచారాలు .. షాకింగ్ డీటెయిల్స్ !
young man attacks woman
Follow us

|

Updated on: Dec 06, 2019 | 8:40 PM

హైదరాబాద్ లో దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. పోలీసుల చర్యపట్ల దిశ కుటుంబంతో బాటు అనేకమంది సెలబ్రిటీలతో సహా హర్షం ప్రకటిస్తున్నారు. అయితే ఇండియాలో ఇలాంటి కేసుల వివరాల్లోకి ఒక్కసారి వెళ్తే.. ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ దేశంలో 2017 లో 32, 500 కు పైగా రేప్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. రోజుకు ఇవి సుమారు 90 కేసులవరకు ఉన్నట్టు వెల్లడయింది. ఆ ఏడాదిలో దేశంలోని కోర్టులు వీటిలో కేవలం 18, 300 కేసులను మాత్రమే పరిష్కరించాయని, ఆ సంవత్సరాంతానికి ఇంకా వేలాది కేసులు పెండింగులో పడిపోయాయని తెలిసింది. మహిళలు, యువతులపై అత్యాచారాలు, హింస అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్టను దిగజార్చాయి. ఇక ప్రధానంగా కొన్ని కేసుల విషయానికి వస్తే.. 1973 : నవంబరు : ముంబైలోని ఓ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ లో ఉన్న అరుణా షాన్ బాగ్ అనే నర్సుపై వార్డు అటెండెంట్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె గొంతు నులిమి… కుక్కలను కట్టేసే గొలుసుతో ఆమెను మంచానికి కట్టేశాడు. పైగా ఆమె తలకు ఆక్సిజన్ సప్లై చేసే ట్యూబ్ ను కట్ చేయడంతో ఆమె కోమాలోకి వెళ్ళింది. దాదాపు 40 సంవత్సరాల పాటు కోమాలోనే ఉండి చివరకు 2015 లో మరణించింది. 1990: కోల్ కతాలో 14 ఏళ్ళ హీతల్ ఫరేఖ్ అనే విద్యార్థినిపై ధనుంజయ్ ఛటర్జీ అనే వ్యక్తి రేప్ చేసి హత్య చేశాడు. 2004 లో అతనికి ఉరిశిక్షవిధించారు. (13 ఏళ్లలో ఇండియాలో ఒక వ్యక్తికి ఉరి శిక్షను అమలు చేయడం అదే మొదటిసారి). 1992: రాజస్థాన్ లో భన్వరీ దేవి అనే మహిళను అయిదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అయితే 1995 లో జైపూర్ కోర్టు వారిని నిర్దోషులుగా విడిచిపుచ్చింది. 1996 : ఢిల్లీలో ప్రియదర్శిని మాటో అనే లా విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అయిన సంతోష్ కుమార్ సింగ్ అత్యాచారం చేసి గొంతు నులిమి చంపాడు. అతనికి మరణశిక్ష పడినా తగినన్ని సాక్ష్యాధారాలు లేవన్న కారణంపై అతడిని కోర్టు వదిలివేసింది. 2012 డిసెంబరు : ఢిల్లీలో ప్రయాణిస్తున్న బస్సులో 23 ఏళ్ళ విద్యార్థినిపై ఓ బాల నేరస్తుడితో బాటు అయిదుగురు అత్యాచారం చేశారు. ఇదే నిర్భయ కేసుగా దేశంలో అలజడి సృష్టించింది. 2018 : జనవరి : యూపీలో 8 ఏళ్ళ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారం జరిగింది. వారం రోజులపాటు ఓ పూజారితో సహా ముగ్గురు పోలీసులు ఆమెకు నరకం చూపి మర్డర్ చేశారు. 2018 జులై : చెన్నైలో 12 ఏళ్ళ బాలికపై ఏడు నెలల కాలంలో పద్దెనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 2018 అక్టోబర్ : కేరళలో ఓ కేథలిక్ బిషప్ తనను రెండేళ్ల పాటు రేప్ చేశాడంటూ ఓ నన్ కేసు పెట్టింది. అయితే ఆ బిషప్ ఆ తరువాత విడుదలయ్యాడు. 2019 జులై : యూపీలో కుల్ దీప్ సెంగార్ అనే ఎమ్మెల్యే 2017 లో ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ సంవత్సరం ఆమె ప్రయాణిస్తున్న కారును అతగాడు యాక్సిడెంట్ చేయడంతో ఆ ప్రమాదంలో ఆమె, ఆమె తరఫు లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. 2019 నవంబరు 28: హైదరాబాద్ లోని శంషాబాద్ లో దిశ అనే యువతిపై హత్యాచారం చేసిన నలుగురు మృగాళ్లు.. (అయితే వీరిని పోలీసులు డిసెంబరు 6 న ఎన్ కౌంటర్ చేశారు). 2019 డిసెంబరు 5 : యూపీలోని ఉన్నావ్ లో ఓ రేప్ బాధితురాలు కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆమె శరీరంపై ముగ్గురు కిరోసిన్ పోసి నిప్పంటించారు.

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా