కోకకోలా బాటలో ‘స్టార్ బక్స్’… ఆ యాడ్స్ కి ఇక స్టాప్ !

ద్వేషపూరిత యాడ్స్ ని సోషల్ మీడియాలో తాము నిలిపివేస్తున్నట్టు స్టార్ బక్స్ ప్రకటించింది. కార్పొరేట్ ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో తామీ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. సమాజంలోని అన్ని వర్గాలనూ ఒకచోటికి చేర్చాలన్నదే తమ ధ్యేయమని, ద్వేషపూరిత ప్రసంగాలను..

కోకకోలా బాటలో 'స్టార్ బక్స్'... ఆ యాడ్స్ కి ఇక స్టాప్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 12:06 PM

ద్వేషపూరిత యాడ్స్ ని సోషల్ మీడియాలో తాము నిలిపివేస్తున్నట్టు స్టార్ బక్స్ ప్రకటించింది. కార్పొరేట్ ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో తామీ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. సమాజంలోని అన్ని వర్గాలనూ ఒకచోటికి చేర్చాలన్నదే తమ ధ్యేయమని, ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రచారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సీటెల్ లోని ఈ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ బక్స్ కి వేలాది రెస్టారెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ‘రియల్ ఛేంజ్ రావాలంటే బిజినెస్ లీడర్లు, పాలసీ మేకర్లు (రాజకీయ నాయకులు) అంతా చేతులు కలపాలని, ముఖ్యంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారానికి స్వస్తి చెప్పాలని ఈ సంస్థ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. రేసిజానికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ వంటి పలు దేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ తాకిడిని తట్టుకోలేక కోకకోలా, యూనీలీవర్ వంటి సంస్థలు ‘దాసోహ’మనక తప్పడంలేదు. అందుకే తాము కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నట్టు స్టార్ బక్స్ వివరించింది. అమెరికాలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను ఉద్యోగులుగా నియమించుకున్న ఈ సంస్థ కూడా ఒకప్పుడు రేసిజం తాలూకు విమర్శలను ఎదుర్కొంది. వచ్ఛే నెలలో ఫేస్ బుక్ ని బాయ్ కాట్ చేయాలని పౌర హక్కుల సంఘం.’.నాకాప్’ పిలుపునివ్వగా.. తాము అందులో భాగస్వాములం కావడం లేదని స్టార్ బక్స్ స్పష్టం చేసింది.