భార్యతో రోహిత్ ఎక్సర్ సైజ్ ల వీడియో వైరల్

పనీపాటాలేని కొందరు వెర్రి ఫ్యాన్స్ కొట్టుకు ఛస్తోంటే.. టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రం తన భార్య రితికతో ఇంట్లో ఎంచక్కా ఎక్సర్ సైజులు చేసుకుంటూ ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడు. తన లైఫ్ పార్ట్నర్ తో..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:30 pm, Tue, 25 August 20
భార్యతో రోహిత్ ఎక్సర్ సైజ్ ల వీడియో వైరల్

పనీపాటాలేని కొందరు వెర్రి ఫ్యాన్స్ కొట్టుకు ఛస్తోంటే.. టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రం తన భార్య రితికతో ఇంట్లో ఎంచక్కా ఎక్సర్ సైజులు చేసుకుంటూ ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడు. తన లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఎక్సర్ సైజులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రోహిత్. కలిసికట్టుగా మరింత బలంగా ముందుకు వెళ్తున్నామంటూ చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రీడాభిమానులు లైకులు మీద లైకులు కొడుతూ రోహిత్ – రితిక సజ్దే ఫిజికల్ ఫిట్ నెస్ వీడియో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలాఉంటే, ధోని – రోహిత్ శర్మ అభిమానుల మధ్య మాటల యుద్ధం మహారాష్ట్రలో ఘర్షణకు దారితీసింది. కొల్హాపూర్‌ జిల్లా కురుంద్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అతని అభిమానులు కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేసి ధోనికి సెండాఫ్ చెప్పారు. మరోవైపు రోహిత్‌ శర్మకు కేంద్రం ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా అతడి అభిమానులు కూడా రోహిత్ ఫోటోలతో కూడిన కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే, రోహిత్‌ కటౌట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఈ వివాదం రగిలింది. ఈ ఘటనపై క్రికెటర్ సెహ్వాగ్ తీవ్రంగా స్పందించారు. క్రికెటర్లంతా చాలా ఫ్రెండ్లీగా ఎవరి పనుల్లో వారుంటారని మీరెందుకు ఇలా చేస్తున్నారంటూ పిచ్చి ఫ్యాన్స్ కు క్లాస్ పీకారు.