Stalking Apple CEO Tim Cook: యాపిల్ సీఈఓ‌కూ తప్పని వేధింపులు.. ఎవరా స్టాకర్ ?

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కి కూడా ఓ వ్యక్తి నుంచి వేధింపులు తప్పలేదు. భారత సంతతికి చెందిన రాకేష్ శర్మ అనే వ్యక్తి తన ట్విటర్ ద్వారా ఆయనను అదేపనిగా వేధించడం

Stalking Apple CEO Tim Cook: యాపిల్ సీఈఓ‌కూ  తప్పని వేధింపులు.. ఎవరా స్టాకర్ ?
Follow us

|

Updated on: Feb 22, 2020 | 6:07 PM

Stalking Apple CEO Tim Cook:  యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కి కూడా ఓ వ్యక్తి నుంచి వేధింపులు తప్పలేదు. భారత సంతతికి చెందిన రాకేష్ శర్మ అనే వ్యక్తి తన ట్విటర్ ద్వారా ఆయనను అదేపనిగా వేధించడం మొదలుపెట్టాడు. కారణం తెలియదు గానీ.. గత ఏడాది సెప్టెంబరు నుంచే అతగాడు ఇలా ఆయన పై సెటైర్లు వేస్తూ.. వ్యక్తిగత ‘ధూషణ కు దిగాడు. కాలిఫోర్నియాలో నివసించే 41 ఏళ్ళ ఈ పెద్దమనిషి ఆకతాయితనానికి హద్దే లేకుండా పోయింది. ఒకసారి పూటుగా మద్యం తాగి.. చేతిలో ఓ పుష్ప గుచ్చాన్ని పట్టుకుని టిమ్ కుక్ ఇంటి వెనుకవైపు ద్వారం గుండా ప్రవేశించబోయాడట..అయితే సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో.. తన ‘ ప్రయత్నాన్ని’ మానుకున్నాడు. మరో సారి కూడా ఇలాగే ఆయన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించబోయాడు. ఈ చర్యలతో విసుగెత్తిన యాపిల్ .. సంస్థ ఇతడిపై చర్యలకు ఉపక్రమించింది. ఇతగాడు టిమ్ ఇంటి దరిదాపులకు రాకుండా ఆంక్షలు విధించింది.