Srisailam Temple : మరో టర్న్ తీసుకున్న శ్రీశైల వివాదం.. 9 మంది ఉద్యోగులను బదిలీ చేసిన ఈవో

తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు..

Srisailam Temple : మరో టర్న్ తీసుకున్న శ్రీశైల వివాదం.. 9 మంది ఉద్యోగులను బదిలీ చేసిన ఈవో
Follow us

|

Updated on: Dec 27, 2020 | 8:03 PM

Employees Transfer : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.. అష్టాదశ శక్తిపీఠం కూడా అయిన శ్రీశైలం పవిత్రతకే భంగం వాటిల్లుతోందా? శ్రీగిరిపై అసాంఘిక శక్తులు ఎంట్రీ ఇచ్చాయా? శ్రీశైలంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శ్రీశైలం దేవస్థానం పరిధిలో హిందూయేత మతస్తులకు షాపులు, కోట్ల రూపాయల కాంట్రాక్టు వర్కులు కేటాయించారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించగా.. స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘాటుగా రియాక్టయ్యారు. ఇద్దరి మధ్య సవాళ్లపర్వం నడిచింది.

ఉద్యోగుల బదిలీ..

శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయికుమారిని ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం జరిగింది.

గోవుల విషయంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్.. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అటు రాజాసింగ్, ఇటు రజాక్, శిల్ప చక్రపాణి మధ్య మాటల యుద్ధం సాగింది. కాగా, ఈ ఆరోపణల పర్వం నేపథ్యంలో గోశాల ఉద్యోగుల బదిలీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.