శ్రీశైలం ప్రమాద ఘటన.. ఎఫ్ఐఆర్ కాపీలో ఇదే కీలకం..

శ్రీశైలం పవర్‌ హౌస్‌ ప్రమాదానికి కారణాలేంటి? అసలు అ ఆరోజు ఏం జరిగింది? శ్రీశైలం పవర్‌ హౌస్‌ ప్రమాదం FIR కాపీ టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. అందులో కీలక అంశాలు ఉన్నాయి.

శ్రీశైలం ప్రమాద ఘటన.. ఎఫ్ఐఆర్ కాపీలో ఇదే కీలకం..

శ్రీశైలం పవర్‌ హౌస్‌ ప్రమాదానికి కారణాలేంటి? అసలు అ ఆరోజు ఏం జరిగింది? శ్రీశైలం పవర్‌ హౌస్‌ ప్రమాదం FIR కాపీ టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. అందులో కీలక అంశాలు ఉన్నాయి. టర్బన్‌ వేగం పెరగడం వల్ల ప్యానెల్‌ యూనిట్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడిందని తేలింది. బ్యాటరీ చేంజ్‌ చేసేటప్పుడు న్యూకిలెన్స్‌ న్యూట్రల్‌గా మారకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీబీసీఐడీ ప్రాథమిక అంచనాకొచ్చింది.

20వ తేదీ రా.10:20 నిమిషాలకు ప్రాజెక్టులో హైడ్రో పవర్‌ టన్నెల్‌లో పని జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని స్పష్టమైంది. దీనిపై అక్కడి ఇన్‌చార్జ్‌ ఉమా మహేశ్వర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఈ, ఏఈ, ఏఏఈలతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. చనిపోయినవారిలో ఇద్దరు అమర్‌రాజా కంపెనీకి చెందిన మెకానిక్‌లు కూడా ఉన్నారు. ప్రమాదంలో పవర్‌హౌస్‌ జనరేటర్‌లు, కేబుల్స్‌, ప్యానెల్స్‌ పూర్తిగా కాలిపోయాయి.

వరదల టైమ్‌లోనే జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. వరదలు లేని సమయంలో పవర్‌ ప్లాంట్‌ మెయింటెనెన్స్‌ పనులు చేస్తారు. వరదలు లేని సమయంలో బ్యాటరీలు మార్చాల్సి ఉండగా… జల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ఎందుకు బ్యాలరీ మార్చారనేది అంతు చిక్కడం లేదు. బ్యాటరీలు మార్చే సమయంలో యూనిట్‌ పూర్తిగా నిలిపివేయాలి. కానీ అలా చేయలేదు. దీంతో ప్యాన్‌ బోర్డులో నిప్పు రాజుకుందని తెలుస్తోంది.