వారెవ్వా.. ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటే…

క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఒకరినొకరు కవ్వించుకోవడం..వ్యక్తిగత దూషణలు..మ్యాచ్‌లకు ముందు ఛాలెంజ్‌లతో వాతావరణం వేడెక్కుతుంది. ఇది ఫ్యాన్స్ మధ్య విపరీత పోకడలకు దారితీస్తోంది. కానీ న్యూజిలాండ్ మాత్రం ఇందుకు విరుద్దం. విజయాలు, అపజయాలు పక్కనబెడితే..ఆ టీమ్ మెంబర్స్ చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అదృష్ణం వారికి కలిసిరాకపోయినా కామ్‌గా నడుచుకుంటారు. అందుకే భారత్‌తో ఆ దేశ క్రికెట్ టీమ్ ఎప్పుడు మ్యాచులాడినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవు. కాగా నేడు(ఆదివారం) ఆఖరి టీ20 […]

వారెవ్వా.. ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటే...

క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఒకరినొకరు కవ్వించుకోవడం..వ్యక్తిగత దూషణలు..మ్యాచ్‌లకు ముందు ఛాలెంజ్‌లతో వాతావరణం వేడెక్కుతుంది. ఇది ఫ్యాన్స్ మధ్య విపరీత పోకడలకు దారితీస్తోంది. కానీ న్యూజిలాండ్ మాత్రం ఇందుకు విరుద్దం. విజయాలు, అపజయాలు పక్కనబెడితే..ఆ టీమ్ మెంబర్స్ చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అదృష్ణం వారికి కలిసిరాకపోయినా కామ్‌గా నడుచుకుంటారు. అందుకే భారత్‌తో ఆ దేశ క్రికెట్ టీమ్ ఎప్పుడు మ్యాచులాడినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవు.

కాగా నేడు(ఆదివారం) ఆఖరి టీ20 జరుగుతోన్న సమయంలో కనిపించిన ఓ విజువల్ క్రీడా స్ఫూర్తిగా అద్దం పడుతోంది. టీ20 సిరీస్ లాస్ట్ మ్యాచ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకున్నాడు. భుజానికి గాయం అవ్వడంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ కూడా డకౌట్‌కే పరిమితమయ్యాడు. దీంతో వీరిద్దరూ బౌండరీ లైన్‌కు ఆవల పక్కపక్కనే కూర్చోని మ్యాచ్‌ను వీక్షించారు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ సరదాగా కనిపించారు. దాదాపు మ్యాచ్ సాగినంతసేపు వారు ముచ్చట్లతో మునిగిపోయారు. పక్కనే రిషభ్ పంత్ సైతం వారితో కలిసిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇకపోతే..కోహ్లీ, కేన్ ఇద్దరూ కూడా అండర్-19 ఆడుతున్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్. ఒకరి ఆటను ఒకరు ఎన్నోసార్లు పొగుడుకున్నారు కూడా..! ఏది ఏమైనా ఇటువంటి దృష్యాలు ఫ్యాన్స్ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడతాయి.

 

Click on your DTH Provider to Add TV9 Telugu