‘పందెంకోడి’ పెళ్లి బాజాలకు బ్రేక్.. అనీషాతో అంతే సంగతులా.?

వైవిధ్యమైన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. ఈ ఏడాది మార్చి 10న అతడికి హైదరాబాద్‌కు చెందిన నటి అనీషాతో నిశ్చితార్థం అయింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి ఫోటోలను అనీషా తరుచూ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు గానీ.. ఇటీవల ఆ ఫొటోలన్నింటిని ఆమె డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ జంట […]

'పందెంకోడి' పెళ్లి బాజాలకు బ్రేక్.. అనీషాతో అంతే సంగతులా.?
Follow us

|

Updated on: Aug 22, 2019 | 12:03 PM

వైవిధ్యమైన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. ఈ ఏడాది మార్చి 10న అతడికి హైదరాబాద్‌కు చెందిన నటి అనీషాతో నిశ్చితార్థం అయింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి ఫోటోలను అనీషా తరుచూ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు గానీ.. ఇటీవల ఆ ఫొటోలన్నింటిని ఆమె డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. వీరి పెళ్లి జరగదని కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అటు నెటిజన్లలో కూడా వీరి బంధానికి ఫుల్‌స్టాప్ పడినట్లేనని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిలో కుటుంబ పెద్దల మధ్య ఉంగరాలు మార్చుకుని వీరు అక్టోబర్‌లో పెళ్లి పీటలెక్కనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈలోపే ఈ న్యూస్ రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కాగా ఈ వార్తలపై అటు విశాల్ గానీ.. ఇటు అనీషా గానీ స్పందించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.