సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..లిస్ట్ చూసుకున్నారా..?

సంక్రాంతి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని తొలగించడానికి, రైల్వే అధికారులు వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఆ ట్రైన్ల వివరాలు దిగువన చూడండి. విజయవాడ-విజయనగరం రైలు నెంబర్ 07184 విజయవాడ-విజయనగరం జనసధరన్ స్పెషల్  జనవరి 11,12,13 తేదీల్లో సర్వీసులు అందించనుంది.  రాత్రి 9.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో,  రైలు నెంబర్ 07185 విజయనగరం-విజయవాడ జనసధరన్ స్పెషల్  జనవరి 12,13  […]

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..లిస్ట్ చూసుకున్నారా..?
Follow us

|

Updated on: Jan 13, 2020 | 3:24 PM

సంక్రాంతి సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని తొలగించడానికి, రైల్వే అధికారులు వివిధ గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఆ ట్రైన్ల వివరాలు దిగువన చూడండి.

విజయవాడ-విజయనగరం

రైలు నెంబర్ 07184 విజయవాడ-విజయనగరం జనసధరన్ స్పెషల్  జనవరి 11,12,13 తేదీల్లో సర్వీసులు అందించనుంది.  రాత్రి 9.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది.

తిరిగి వచ్చే దిశలో,  రైలు నెంబర్ 07185 విజయనగరం-విజయవాడ జనసధరన్ స్పెషల్  జనవరి 12,13  తేదీల్లో సర్వీసులు అందిచనుంది. ఉదయం 7.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉదయం 9.25 గంటలకు  బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. 

అదేవిధంగా, రైలు నెంబర్ 07187 విజయనగరం-విజయవాడ జనసధరన్ స్పెషల్  జనవరి 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి రాత్రి 11.30 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.  రాత్రి 11.32 గంటలకు దువ్వాడ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

తిరిగి వచ్చే దిశలో, రైలు నెంబర్ 07186 విజయవాడ-విజయనగరం జనసధరన్ స్పెషల్  జనవరి 18, 19 తేదీల్లో సర్వీసులు అందించనుంది.  మధ్యాహ్నం 12.15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి.. సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 6.32 గంటలకు దువ్వాడ నుంచి పున:ప్రారంభమై… రాత్రి 8.15 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది.  12 జనరల్ క్లాస్ కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపుడి, అనపర్తి, సమర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సిపట్నం రోడ్, ఎలమంచలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్త వలస స్టాపుల్లో ఆగుతుంది.

విజయనగరం-రాజమండ్రి

రైలు నెంబర్ 07197 విజయనగరం-రాజమండ్రి జనసధరన్ స్పెషల్.. జనవరి 14 న ఉదయం 7.45 గంటలకు విజయనగరం నుండి బయలుదేరి ఉదయం 9.23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉదయం 9.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది.

ఇక  రైలు నెంబర్ 07198 రాజమండ్రి-విజయనగరం జనసధరన్ స్పెషల్ జనవరి 17 సర్వీసును అందించనుంది.  మధ్యాహ్నం 2.50 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి.. సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. దువ్వాడ నుండి సాయంత్రం 6.32 గంటలకు పున: ప్రారంభమై రాత్రి 8.15 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. 12 జనరల్ క్లాస్ కోచ్‌లు ఉన్న ఈ రైలు  ద్వారపుడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సిపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయవాడ విజయనగరం స్టాపుల్లో ఆగుతుంది. 

విశాఖపట్నం-సికింద్రాబాద్

రైలు నెంబర్ 08523 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు జనవరి 12 & 19 (ఆదివారాలు) సర్వీసును అందించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి..మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి వచ్చే దిశలో, 08524 సికింద్రాబాద్- విశాఖపట్నం ప్రత్యేక రైలు జనవరి 13, 20 (సోమవారం) సర్వీసును అందించనుంది.  సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్ స్టేషన్స్‌లో స్టాప్స్ ఉన్నాయి.

విశాఖపట్నం-విజయవాడ డబుల్ డెక్కర్ స్పెషల్

రైలు నెంబర్ 08525 విశాఖపట్నం-విజయవాడ డబుల్ డెక్కర్ ప్రత్యేక రైలు జనవరి 12 & 19 (ఆదివారాలు) తేదీల్లో సర్వీసులు అందించనుంది.  ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి ఉదయం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

తిరిగి వచ్చే దిశలో,  08526 నెంబర్ గల విజయవాడ-విశాఖపట్నం డబుల్ డెక్కర్ ప్రత్యేక రైలు 12 & 19 (ఆదివారాలు) సర్వీసును అందించనుంది.  విజయవాడ నుండి  సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఎనిమిది డబుల్ డెక్కర్ కోచ్‌లు గలు ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్స్‌లో స్టాప్స్‌లో ఆగుతుంది.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం