ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, విద్యార్థులు వంటి వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడానికి ముందు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది...

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు
Follow us

|

Updated on: May 01, 2020 | 7:26 PM

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, విద్యార్థులు వంటి వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడానికి ముందు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. రైళ్ళలో ప్రయాణం చేసే వారి కదలికలను నియంత్రించలేం కాబట్టి వారికి కరోనా వైరస్ సోకకుండా, వారు చేరే గమ్యం స్థానాలలో కూడా కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రారంభం అవడానికి కారకులు అవుతారని కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించింది.

దానికి అనుగుణంగా ప్రత్యేక అంశాలను రూపొందించిన తర్వాత శ్రామిక్ స్పెషల్ రైళ్లను కార్మిక దినోత్సవమైన మేడే రోజున ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలి రైలు హైదరాబాద్ శివారులోని లింగంపల్లి నుంచి శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పాట్నా, రాంచీలకు బయలు దేరింది. ఈ రైలు బయలుదేరడానికి ముందు అధికారులు పెద్ద కసరత్తే నిర్వహించారు.

సంగారెడ్డి శివారులోని ఐఐటి హైదరాబాద్‌లో పనిచేస్తున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల వలస కార్మికులను ముందుగానే ఆంక్షల పరిధిలోకి తెచ్చారు అధికారులు. రెండు రోజుల పాటు వారికి కరోనా ముందస్తు పరీక్షలు నిర్వహించారు. వారంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం బస్సులలో వారిని సంగారెడ్డి సమీపంలోని కంది నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తరలించారు.

ప్రత్యేక రైలు శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన తర్వాత హైదరాబాద్ నుంచే మరో ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సమాయత్తమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకు సంబంధించి ఎలాంటి నిబంధనలు రూపొందించారు అనే విషయంలో కేంద్ర హోం శాఖ ఒక మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది.

(1) ఈ ప్రత్యేక రైళ్లను ఒక పాయింట్ నుంచి ఇంకొక నిర్దిష్టమైన స్టేషన్‌కు మాత్రమే నడపాలని కేంద్ర హోంశాఖ రైల్వే అధికారులకు సూచించింది.

(2) ఈ ప్రత్యేక రైళ్ళలో ప్రయాణం చేసే వారికి వారు బయలుదేరడానికి ముందే కరోనా ముందస్తు పరీక్షలు నిర్వహించి.. క్లీన్ చిట్ వస్తేనే వారిని తరలించాలని హోంశాఖ ఆదేశించింది.

(3) ప్రత్యేక రైళ్ల రాకపోకలు, అందులో ప్రయాణం చేసే వారి వివరాలను ఒక నోడల్ అధికారి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించింది.

(4) ఈ రైలులో ప్రయాణం చేసే వారు విధిగా శానిటైజర్లను వినియోగించాలని, మొఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని హోంశాఖ ఆదేశించింది.

(5) ప్రయాణికులందరికీ రైల్వే శాఖనే పరిశుభ్రమైన ఆహారాన్ని అందజేయాలని హోం శాఖ నిర్దేశించింది.

(6) ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరిన తర్వాత అక్కడి స్థానిక ప్రభుత్వ అధికారులు వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలని హోంశాఖ ఆదేశించింది.

శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ఆపరేషన్‌కు సంబంధించి రైల్వే శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఈ మేరకు కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ దత్ బాజ్‌పేయి తెలిపారు. లింగంపల్లి నుంచి హతియా, నాసిక్ నుంచి లక్నో, అలువ నుంచి భుబ్, నాసిక్ నుంచి భోపాల్, జైపూర్ నుంచి పాట్నా, కోటా నుంచి హతియాల మధ్య మరో ఆరు ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడపనున్నట్లు ఆయన తెలిపారు.

!

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం