ఒకే వ్యక్తి కోసం ప్రత్యేక విమానం

అసలే లాక్ డౌన్ తో ఆర్థిక భారంతో నడుస్తున్న విమాన సర్వీసులు.. ఏకంగా ఒక వ్యక్తి కోసం కొల్‌కతా నుంచి చెన్నైకి చేరుకుంది. వందేభారత్ పేరుతో కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి కోల్‌కతా మీదుగా చెన్నైకి ఓ ప్రత్యేక విమానం చేరుకుంది. కొల్‌కతా నుంచి చెన్నై ఒక వ్యక్తి కోసం ప్రత్యేక విమానం నడిపారు అధికారులు.

ఒకే వ్యక్తి కోసం ప్రత్యేక విమానం
Follow us

|

Updated on: Jun 29, 2020 | 3:37 PM

అసలే లాక్ డౌన్ తో ఆర్థిక భారంతో నడుస్తున్న విమాన సర్వీసులు.. ఏకంగా ఒక వ్యక్తి కోసం కొల్‌కతా నుంచి చెన్నైకి చేరుకుంది. వందేభారత్ పేరుతో కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి కోల్‌కతా మీదుగా చెన్నైకి ఓ ప్రత్యేక విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు ఎయిరో బ్రిడ్జ్ విమానానికి అనుసంధానం చేశారు. అందులో ఒకే ప్రయాణికుడు వస్తుండడం చూసిన అధికారులు అవాక్కయ్యారు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు కోల్‌కతా మీదుగా ఈ ప్రత్యేక విమానం చెన్నై చేరుకుంది. ఆ విమానం నుంచి చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒక్కరూ మాత్రమే వచ్చారు. ఆ వ్యక్తిని విచారించగా సింగపూర్‌ నుంచి 145 మంది ప్రయాణికులు ఇండియాకు బయలుదేరారు. కొల్‌కతా చేరకోగానే 144 మంది ప్రయాణికులు దిగిపోయారు. తాను మాత్రమే చెన్నై వచ్చానని బదులిచ్చాడు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.