దివికేగిన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం

18 ఏళ్ల ఓ కుర్రాడు గొంతు సవరించుకుని స్వరం విప్పాడు.. లేలేత ఆ స్వర మాధుర్యం అక్కడున్నవారందరికీ నచ్చింది.. పాటపాడిన విధానమూ తెగ నచ్చేసింది..

దివికేగిన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం
Follow us

|

Updated on: Sep 25, 2020 | 3:25 PM

అది 1964…. మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌… అక్కడ జరుగుతున్నవి లలిత సంగీతం పోటీలు … ప్రఖ్యాత సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు న్యాయనిర్ణేతలు.. ప్రేక్షకులలో మరో సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి కూడా ఉన్నారు.. 18 ఏళ్ల ఓ కుర్రాడు గొంతు సవరించుకుని స్వరం విప్పాడు.. లేలేత ఆ స్వర మాధుర్యం అక్కడున్నవారందరికీ నచ్చింది.. పాటపాడిన విధానమూ తెగ నచ్చేసింది.. న్యాయనిర్ణేతలు ఆ కుర్రోడికే ఫస్ట్‌ ప్రైజ్‌ ఇచ్చేశారు.. లేతగా ఉన్న గొంతులో కొంత మార్దవ్యం వచ్చాక సినిమాల్లో పాడిస్తామని మాట ఇచ్చారు. ఆ పిల్లోడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం… అదే కాదు.. అంతకు ముందు కూడా చాలా పోటీల్లో చాలా ప్రైజులు గెల్చుకున్నాడాయన! గూడూరు కళారాధన సమితి నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి గెల్చుకున్నాడు.. ఆ పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్‌.జానకి అసలు ప్రథమ బహుమతి బాలుకే దక్కాలని నిర్మోహమాటంగా చెప్పేశారు.. వర్థమాన గాయకులకు అన్యాయం చేయకూడదంటూ న్యాయమూర్తులకు ఓ సూచన కూడా ఇచ్చారు. అదే సమయంలో సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించమని బాలుకు కూడా సలహా ఇచ్చారు జానకి! జానకి మాటలు బాలుకు మనోధైర్యాన్ని ఇచ్చాయి.. మద్రాస్‌లో ఇంజనీరింగ్‌ చదువుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు..

బాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు.. ఎవరిదగ్గరా నేర్చుకోలేదు.. అయితేనేం విన్న వెంటనే ట్యూన్‌ను పట్టేసే అద్భుతమైన ప్రతిభ ఆయనలో ఉంది..సంగీత పరిజ్ఞానం స్వతహాగా అబ్బింది.. అవకాశాల కోసం అలా కోదండపాణిని కలుస్తూ ఉండేవారు.. ఆయన కూడా ఇచ్చిన మాట తప్పలేదు.. తొలిసారిగా బాలుతో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలోని ఓ పాటను పాడించారు.. ఆ సినిమాకు నిర్మాత పద్మనాభం.. అప్పటికే ఆయనకు తన స్వీయగీతం రాగము అనురాగము అన్న పాటను, దోస్తీ సినిమాలో రఫీ పాడిన జానేవాలో జరా అన్న పాటను పాడి వినిపించారు.. బాలు పాటలు పద్మనాభంకు బాగా నచ్చాయి.. దాంతో ఆయన కూడా ఓకే అనేశారు.. వీటూరి రాసిన ఏమి ఈ వింత మోహం అన్న పాట బాలు తొలి సినిమా పాటైంది.. మాల్కోస్‌, యమన్‌, కల్యాణి, భాగేశ్వరి రాగాలలో స్వరపరిచన ఆ పాటను బాలుతో వారం రోజుల పాటు ప్రాక్టీస్‌ చేయించారు కోదండపాణి. ఆ పాటను సుశీల, ఈలపాట రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌లతో కలిసి ఏ మాత్రం బెరకు లేకుండా సింగిల్‌ టేక్‌లో పాడేశారు బాలు.. ఈ పాట డిసెంబర్‌ 15, 1966న విజయాగార్డెన్స్‌లో రికార్డయ్యింది.. సినిమా జూన్‌ 2, 1967లో విడుదలయ్యింది.. ఆ చినుకు వానైంది… వరదైంది.. 40 వేల పాటల ప్రవాహమైంది.. పాటల ప్రేమికులను తడిసి ముద్ద చేసింది..

ఏమి వీ వింత మోహం అన్న పాట తర్వాత మూగజీవులు సినిమాలో దయలేని లోకాన అనే పద్యాన్ని ఆలపించారు.. ఆ పద్యాన్ని మహదేవన్‌కు వినిపించారు కోదండపాణి.. మహదేవన్‌కు కూడా బాలు స్వరం నచ్చేసింది.. తన ప్రైవేటుమాస్టారులో పాడుకో పాడుకో పాడుతూ చదువుకో అన్న పాటను పాడించారు.. అటు పిమ్మట కోదండపాణి స్వరదర్శకత్వంలోనే వచ్చిన సుఖదుఃఖాలు సినిమాలోని మేడంటే మేడా కాదు, అందాలు చిందే ఆ కళ్లలోనే పాటలు తెలుగు శ్రోతలకు మరింత దగ్గర చేశాయి.. బాపు దర్శకత్వంలో వచ్చిన బంగారుపిచికలో ఓహోహో బంగారు పిచ్చికా, మనసే గని తరగని పాటలు పాడించిన మహదేవన్‌ ఆ తర్వాత ఉండమ్మా బొట్టు పెడతా లో రావమ్మా మహాలక్ష్మి, చుక్కలతో చెప్పాలని, చాలులే నిదురపో జాబిలీ కూనా పాటలు పాడించారు. ఈ పాటల తర్వాత బాలుకు అవకాశాలు పెరిగాయి..

కోదండపాణి సంగీతంలోనే వచ్చిన శ్రీరామకథలోని రామకథ శ్రీరామకథ, రాగమయం అనురాగమయం, మంచిమిత్రులు సినిమాలో ఘంటసాలతో పాడిన ఎన్నాళ్లో వేచిన ఉదయం, మహాబలుడులో విశాల గగనంలో చందమామ, ఆస్తులు అంతస్తులులోని ఒకటై పోదామా ఊహల వాహినిలో పాట పాపులరయ్యాయి.. ఇక సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన టక్కరిదొంగ చక్కని చుక్క సినిమాలో నడకలు చూస్తే మనసవుతుంది, కలలుగనే కమ్మని చిన్నారి పాటలు, మహదేవన్‌ సంగీతంలో వచ్చిన ముహూర్తబలం సినిమాలో బుగ్గ గిల్లగానే సరిపోయిందా పాట, సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలో వచ్చిన ఆత్మీయులులోని చిలిపి నవ్వుల నిను చూడగానే పాట జనాలకు దగ్గర చేశాయి.. జగత్‌ కిలాడీలు సినిమాలోని వేళ చూస్తే సందెవేళ, మనుషులు మారాలి సినిమాలోని తూరుపు సిందూరపు పాట, బందిపోటు బీమన్నలోని నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో పాట, ఏకవీరలో ప్రతిరాత్రి వసంత రాత్రి పాట రేడియోలలో మారుమోగాయి.. శ్రోతల హృదయాలలో నిలిచిపోయాయి. ఏడో దశకం నుంచి బాలు బిజీ అయ్యారు..1946, జూన్‌ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట అనే గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు బాలసుబ్రహ్మణ్యం. తండ్రి సాంబమూర్తి హరికథా భాగవతార్‌.. పౌరాణిక నాటకాలు కూడా వేసేవారు.. ఆ విధంగా బాలుకు చిన్నతనం నుంచే సంగీతం పట్ల ఆసక్తి, అభిరుచి పెరిగాయి.. అయిదేళ్ల చిరుత ప్రాయంలోనే తండ్రితో కలిసి భక్త రామదాసు నాటకంలో నటించారు బాలు. మేనమామ ఇంట ప్రాథమిక విద్యను అభ్యసించిన బాలు ఆ తర్వాత శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో చేరారు. ఆ స్కూలులోని ఉపాధ్యాయులు జి.వి.సుబ్రహ్మణ్యం బాలుతో చెంచెలక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున పాటను పాడించి రికార్డు చేశారు.. ఆ పాటను పదిమందికి వినిపించారు.. ఆ పాఠశాలలోనే రాధాపతి అనే టీచర్‌ బాలుతో నాటకాలు వేయించారు.. స్కూలు చదువయ్యాక తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ చదివారు బాలు.. అప్పుడే రేడియలో నాటకాలు వేశారు. లలిత గీతాలు పాడారు.. పీయూసీ అయ్యాక మళ్లీ నెల్లూరుకు వచ్చి ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్‌ చేశారు.. అనంతపురంలో ఇంజనీరింగ్‌ సీటు రావడంతో అక్కడికి వెళ్లారు కానీ.. అక్కడి వాతావరణం పడక మళ్లీ నెల్లూరుకు వచ్చారు బాలు. అక్కడి నుంచి మద్రాస్‌కు వెళ్లి ఎఎంఐఈలో చేరారు. అక్కడే చదువుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.. కోదండపాణి దయ చేత సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది.. గురువుగారికి గుర్తుగా బాలు కట్టిన రికార్డింగ్‌ స్టూడియోకు కోదండపాణి అనే పేరు పెట్టడం ఎంతైనా సమంజసం. ఘంటసాల గొంతును పదే పదే విన్న శ్రోతలకు బాలు గొంత కొత్తగా లేతగా వినిపించింది.

ఘంటసాల ఆరోగ్యం క్షీణించటంతోనే బాలుకు పాటలు పాడే అవకాశాలు ఎక్కువగా దొరికాయంటారు కానీ అందులో అర్థసత్యమే ఉన్నది.. ప్రతిభ ఉన్న వ్యక్తి ఎలాగైనా రాణిస్తారనడానికి బాలునే పెద్ద ఉదాహరణ. ప్రతీ సంగీత దర్శకుడి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్నారు. వారి దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు. సినిమా పాటలు పాడే విధానాన్ని ఆకలింపు చేసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన స్వరాన్ని మార్చుకున్నారు.. రోజుకు పదిహేను పాటలు పాడే స్థాయికి ఎదిగారు.

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??