SCR: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో పూర్తయిన డబ్లింగ్ విద్యుదీకరణ పనులు..

దక్షిణ మధ్య రైల్వే కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులపై జోన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ - మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో...

SCR: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో పూర్తయిన డబ్లింగ్ విద్యుదీకరణ పనులు..
Trian Track
Follow us

|

Updated on: Mar 30, 2022 | 9:13 PM

దక్షిణ మధ్య రైల్వే కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులపై జోన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో దక్షిణ తెలంగాణలో ప్రధానమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌ నుంచి దక్షిణం వైపు ఉన్న కర్నూలు, అనంతపరం, కడప, బెంగళూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో అనుసంధానంలో ఈ డబ్లింగ్ లైన్ ప్రధానమైనది. రైల్వే అనుసంధానం పెరగడంతో నూతన అవకాశాలు మెరుగుపడి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. గొల్లపల్లి – దివిటిపల్లి మధ్య 10 కి.మీల మేర డబ్లింగ్‌, గొల్లపల్లి – మహబూబ్‌నగర్‌ మధ్య 25 కి.మీల విద్యుదీకరణ పనులు నేడు పూర్తయ్యాయి. ఫలితంగా ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయింది. తెలంగాణలో రైళ్ల నిర్వహణ బలోపేతం కోసం మంజూరు చేసిన కీలక ప్రాజెక్టులలో సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ విద్యుదీకరణ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టును రైల్వే పీఎస్‌యూ, రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) చేపట్టారు. 85 కి.మీల గల ఈ ప్రాజెక్టును రూ.774 కోట్ల అంచనా వ్యయంతో 2015 – 16 సంవత్సరంలో మంజూరైంది. సికింద్రాబాద్‌ – ఉందానగర్‌ మధ్య 28 కి.మీలు, ఎమ్‌ఎమ్‌టీఎస్‌ మొదటి, రెండో దశల ప్రాజెక్టులలో భాగంగా చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ విద్యుదీకరణ ప్రాజెక్టు పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే, ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ కిశోర్‌ అభినందించారు. కీలకమైన ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి కావడానికి నిబద్ధతతో, అంకిత భావంతో శ్రమించిన ఉద్యోగులందరినీ జనరల్‌ మేనేజర్‌ ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో సెక్షన్‌లో సామర్థ్యం పెరుగుతుందని, హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ ప్రాంతాలతో దక్షిణాది పట్టణాల అనుసంధానం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also  Read

Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు

4 టన్నుల డైనమైట్‌.. 40 అంతస్తులు.. 9 సెకెన్లలో ఢాం..నేలపై కుషన్లు.! వీడియో చుస్తే మతి పోవాల్సిందే..

IPL 2022: వికెట్‌ తీసిన సంబరంలో..భార్యకు ఫ్లైయింగ్ కిస్‌ ఇచ్చిన చాహల్‌.. నెట్టింట్లో వైరల్‌..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..