సోనూ సూద్ దాతృత్వం.. ఫిలిప్పీన్స్‌కు ప్రత్యేక విమానం..!

సోనూ సూద్ దాతృత్వం.. ఫిలిప్పీన్స్‌కు ప్రత్యేక విమానం..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 8:47 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ‌ట్విటర్‌లో ప్రకటించారు.

వలస కార్మికుల పాలిట హీరో అయినా సోనూ సూద్.. ‘‘భారత్‌-పిలిప్పీన్స్‌.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ సోనూ సూద్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

[svt-event date=”12/08/2020,8:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu