Sonia demand మోదీ ముందుకు సోనియా తాజా డిమాండ్.. అదిరింది మేడమ్!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సరికొత్త డిమాండ్‌తో తెరమీదికి వచ్చారు. చాలా రోజుల తర్వాత నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ సందర్భంగా సోనియా గాంధీ తన కొత్త డిమాండ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుంచారు.

Sonia demand మోదీ ముందుకు సోనియా తాజా డిమాండ్.. అదిరింది మేడమ్!
Follow us

|

Updated on: Apr 02, 2020 | 2:27 PM

Sonia Gandhi came out with a new demand: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సరికొత్త డిమాండ్‌తో తెరమీదికి వచ్చారు. చాలా రోజుల తర్వాత నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ సందర్భంగా సోనియా గాంధీ తన కొత్త డిమాండ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుంచారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగింది. భేటీ ప్రారంభంలో ప్రసంగించిన సోనియా గాంధీ… దేశంలో ప్రస్తుతం నెలకొన్ని లాక్ డౌన్ పరిస్థితిపైనా, కరోనా వైరస్ వ్యాప్తిపైనా ప్రధానంగా మాట్లాడారు. మానవాళి సంక్షోభంలో వున్న సమయంలో ఇలా కలుస్తున్నందుకు బాధగా వుందంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సోనియాగాంధీ.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాలు చాలా పెద్దదని, అయినా దాన్ని అధిగమిస్తామన్న నమ్మకం ఉంది అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

కరోనాపై యుద్ధంలో నిత్య వైద్య పరీక్షలు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కాంగ్రెస్ అధినేత్రి అభిప్రాయపడ్డారు. వైద్యులు, మెడికల్ సిబ్బందికి రక్షణ చాలా అవసరమని, వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఎన్-95 మాస్కులు అందజేయాల్సి వుందని అన్న సోనియాగాంధీ ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు.

దేశంలో పేదలు, దినసరి కూలీలకు ప్రస్తుతం పెను ప్రమాదం పొంచి వుందని, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలను యుద్దప్రాతిపదికన తీసుకోవాల్సి వుందని సోనియా గాంధీ కేంద్రానికి సూచించారు. 21 రోజుల లాక్ డౌన్ అత్యంత అనివార్యమేనని, కానీ కేంద్ర ప్రభుత్వానికి తగిన ప్రణాళిక లేకపోవడంతో వలస కుటుంబాలు, కూలీలు ఇబ్బందుల పాలవుతున్నారని సోనియా గాంధీ మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు.

కరోనా నియంత్రానికి చేపట్టిన చర్యలు, ఐసొలేషన్ వార్డుల వివరాలు, క్వారెంటైన్ ఏర్పాట్లు వంటి అంశాలను కామన్ పీపుల్‌కు అందుబాటులో వుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సోనియా గాంధీ. ముఖ్యంగా భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరతను రాకుండా చర్యలు చేపట్టాలని, అందుకు రైతులకు తగిన చేయూతను అందించాలని ఆమె కేంద్రానికి సూచించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడడంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, పారిశ్రామిక వేత్తలకు తగిన ప్యాకేజీ అవసరమని కాంగ్రెస్ అధినేత్రి అంటున్నారు. ఆ దిశగా సమగ్ర ప్రణాళికతో కేంద్రం సిద్దం కావాల్సి వుందన్నారు.