పార్లమెంట్ తొలి సెషన్ కి హాజరు కాలేని సోనియా, రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరు కాలేరు. మెడికల్ చెకప్ కోసం సోనియా విదేశాలకు బయల్దేరివెళ్లారు. సుమారు రెండువారాలపాటు..

పార్లమెంట్ తొలి సెషన్ కి హాజరు కాలేని సోనియా, రాహుల్ గాంధీ
Follow us

| Edited By: Balu

Updated on: Sep 13, 2020 | 10:15 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరు కాలేరు. మెడికల్ చెకప్ కోసం సోనియా విదేశాలకు బయల్దేరివెళ్లారు. సుమారు రెండువారాలపాటు ఆమె అక్కడే ఉంటారని, ఆమె వెంట రాహుల్ కూడా వెళ్లారని పార్టీ ట్వీట్ చేసింది. రాహుల్ మాత్రం కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చి పార్లమెంటుకు హాజరవుతారు. చట్ట సభలో తమ పార్టీ లేవనెత్తాల్సిన అంశాలపై సోనియా తమ వారికి దిశానిర్దేశం చేశారు. వ్యూహాత్మకంగా ఆమె తను వెళ్లేముందే పార్టీని దాదాపు ‘ప్రక్షాళన’ చేసేశారు. గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, అంబికా సోనీ వంటి వారిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించారు. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ ప్రాధాన్యతను తగ్గించేశారు.

రణదీప్ సింగ్ సూర్జేవాలా, పి.చిదంబరం, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్ తదితరులను పునర్వ్యవస్థీకరించిన వర్కింగ్ కమిటీలో రెగ్యులర్ సభ్యులుగా సోనియా నియమించారు. రాహుల్ విధేయుడు రణదీప్ సింగ్ ససుర్జేవాలాను ప్రధాన కార్యదర్శిని చేసి  కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జిగా నియమించారు. ఇలా తన ఫారిన్ టూర్ కి ముందు సోనియా …. ‘ లేఖతో’ అసమ్మతివాదులుగా ముద్ర పడినవారిని దాదాపు పక్కనపెట్టి బయల్దేరారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!