ఆ పొలంలో తిష్ట వేసిన నాగుపాము..ఇప్పటికే పాలేరు, జత ఎడ్లు, ఆవు బలి…వణిపోతున్న తండా వాసులు..!

పాము పగ పన్నెండేళ్లైనా పొదన్న వాదన ఇప్పటికీ ఆ పల్లెల్లో మారుమోగుతోంది. దశాబ్దకాలం క్రితం కనిపించిన పాము కాటు మరణాలు మళ్లీ ఆగ్రామంలో తెర మీదకొస్తున్నాయి.

ఆ పొలంలో తిష్ట వేసిన నాగుపాము..ఇప్పటికే పాలేరు, జత ఎడ్లు, ఆవు బలి...వణిపోతున్న తండా వాసులు..!
Follow us

|

Updated on: Dec 14, 2020 | 8:31 PM

పాము పగ పన్నెండేళ్లైనా పొదన్న వాదన ఇప్పటికీ ఆ పల్లెల్లో మారుమోగుతోంది. దశాబ్దకాలం క్రితం కనిపించిన పాము కాటు మరణాలు మళ్లీ ఆగ్రామంలో తెర మీదకొస్తున్నాయి. మనుషులైనా, జంతువులు అయినా.. ఆ చేనులోకి వెళ్తుంటే కాటేసి పొట్టన పెట్టుకుంటుంది అని ప్రచారం జరుగుతంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని డొడర్న కిసాన్‌ నాయక్‌తండా ప్రజలు ప్రస్తుతం పాము భయంతో వణికిపోతున్నారు.

ఈ తండాకు చెందిన రాథోడ్‌ సునీల్‌ అనే రైతుకు సర్వే నెం.163లో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ చేనులో పత్తి, కంది పంటను సాగు చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం తన పాలేరు సురేష్ తో కలిసి పని చేస్తుండగా గత నెల రోజుల క్రితం పాము కాటేసింది. ‘పాము పాము..’ అని కేకలు వేస్తూ సురేష్ నురగలు‌కక్కుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోగానే మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన పదిరోజులకు మరొక పాలేరు ప్రేమ్‌ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు రాథోడ్ సునీల్. అయితే, మూడు రోజుల తరువాత ఆ పాలేరు పని ముగించుకుని ఎద్దులను అక్కడే చేనులో కట్టేసి వెళ్లిపోయాడు. తిరిగి చేనుకు వెళ్లి చూసేలోగా ఒక ఎద్దు పాము కాటుకు గురై మృతి చెందింది. మరో వారం రోజుల తర్వాత అదే చేనులో అదే రైతుకు చెందిన మరో ఎద్దు, మరో రోజు తరువాత ఓ ఆవు సైతం పాము కాటుతో మృతి చెందాయి. దీంతో భయబ్రాంతులకు గురైన కొత్త పాలేరు ప్రేమ్‌ పనులకు రావడం మానేశాడు.

రెండు రోజుల క్రితం పది మంది కలిసి ఈ చేను దాటి వ్యవసాయ పనులకు వెళుతున్న సమయంలో పాము వెంబడించింది. భయంతో పరుగులు తీసిన వ్యవసాయ కూలీలు ఆ వైపు చచ్చిన రామంటూ ఖరాఖండిగా చెపుతున్నారు. ఆ వైపు వెళితే మమ్మల్ని పాము చంపేస్తుందని ఆందోళన చెందుతున్నారు. పాము పగ పట్టి బలి తీసుకుంటుందని భయపడుతున్నారు.  ఆ పామును పట్టుకునేందుకు చేను యజమాని రాథోడ్ సునీల్ ప్రయత్నించగా ఆ ఇంట్లో నలుగురు అస్వస్థకు గురయ్యారని చెబుతున్నారు. దీంతో భయబ్రాంతులకు గురైన సునీల్ పామును పట్టే పనులను విరమించుకున్నాడు. అయితే తమ గ్రామంపై పాము పగ పట్టిందని.. పొలం పనులు చేసుకోనివ్వడమ లేదని.. గురువులతో పూజలు చేయించిన ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు డొడర్న కిసాన్‌ నాయక్‌తండా వాసులు.

ఏది ఏమైనా వారిలో కాస్త ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ చేనులో పాము పుట్ట లేదా స్థావరం ఉండవచ్చని..అలకిడి వచ్చినప్పుడు అది ఆత్మరక్షణ కోసం కాటువేసి ఉండొచ్చొని నిపుణులు భావిస్తున్నారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం