రుణ గ్రహీతలు పెరిగారు… కరోనా కాలంలో పెరిగిన వ్యక్తిగత రుణాలు.. రెండేళ్లలో 5 రెట్లు పెరిగిన మార్కెట్

అవసరాలు పెరిగిపోతుండడం, కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య రెండేళ్లలో 5 రెట్లు పెరిగిందని తాజాగా వెలువడిన సర్వేలో తేలింది.

రుణ గ్రహీతలు పెరిగారు... కరోనా కాలంలో పెరిగిన వ్యక్తిగత రుణాలు.. రెండేళ్లలో 5 రెట్లు పెరిగిన మార్కెట్
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2020 | 7:52 AM

అవసరాలు పెరిగిపోతుండడం, కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య రెండేళ్లలో 5 రెట్లు పెరిగిందని తాజాగా వెలువడిన సర్వేలో తేలింది. కరోనా నేపథ్యంలో స్వల్ప పరిమితి కలిగిన రుణాల మంజూరు వ్యవస్థ విలువ ఎంత అంటే… దాదాపు 12 వేల కోట్ల రూపాయలు.

బ్యాంకులకు కాకుండా ఆన్‌లైన్ వ్యవస్థల ద్వారా రుణాలు…

బ్యాంకులు రుణాల మంజూరులో వివిధ కొర్రీలు పెడుతుండడంతో భారతీయులు అధిక శాతం ఆన్‌లైన్ లోన్ తీసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ వ్యవస్థలు తక్కువ డాక్యుమెంట్లు, ట్రాన్సక్షన్స్, సిబిల్ చూసి రుణాలను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తుండడంతో ఎక్కువ మంది వ్యక్తిగత రుణాలను ఆన్‌లైన్ సైట్ల నుంచి పొందుతున్నారు. అంతేకాకుండా అధిక శాతం మంది కేవలం 50 వేల లోపే రుణాలను తీసుకుంటున్నారు.

రెండేళ్లలో వృద్ధి….

2017 -18 సంవత్సరంలో స్పల్ప రుణాలు తీసుకునే వారి శాతం దేశంలో 12.9 శాతంగా నమోదైంది. తాజా లెక్కల ప్రకారం 2020లో దాదాపు రుణగ్రహీతల శాతం 60 శాతానికి పెరిగింది. ఈ లెక్కన దాదాపు 5 రెట్లు వ్యక్తిగత రుణాల మంజూరు మార్కెట్ పెరిగింది. 50 వేల లోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య కేవలం 2019 -20 ఆర్థిక సంవత్సరంలోనే 162 శాతం పెరిగింది. కరోనాతో ఈ శాతం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది.