ఏపీలో విస్తరిస్తున్న ‘ఆ’ వైరస్.. పశువులకు డేంజరే..!

ఏపీలో పశు సంపద కలిగిన రైతులను కొత్త వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.

ఏపీలో విస్తరిస్తున్న 'ఆ' వైరస్.. పశువులకు డేంజరే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2020 | 2:53 PM

Skin disease in cattle spreads: ఏపీలో పశు సంపద కలిగిన రైతులను కొత్త వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని కడప జిల్లాలోని బద్వేల్, కోడూరు ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా విజృంభిస్తోంది. ఇక ఆ వ్యాధి పేరు లంపిస్కిన్. ఈ వ్యాధి పోక్స్‌విరిడే కుటుంబం, కాప్‌రిపోక్స్‌ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది పశువులు, ఎద్దులు, గేదెలపై శరవేగంగా వ్యాపించి ప్రాణాలను తీసేస్తుంది. హర్యానా రాష్ట్రంలో విస్తరించిన ఈ మహమ్మారి ఇప్పుడు ఏపీలో పాకుతోంది.

ఈ వ్యాధి సోకిన పశువులు, ఎద్దులు, గేదెల్లో రెండు రోజుల పాటు జ్వరం, తరువాత గట్టిగా గుండ్రని కటానియాస్ నోడ్యూల్స్, ఫైబారస్ కణజాల పెరుగుదల లాంటివి వచ్చి 7 నుంచి 21 రోజుల పాటు శరీరంపై ఉంటాయి. నోటిలో గాయాలు, ఫారింక్స్, శ్వాసకోశ, ఎమాసియేషన్, అవయవాలపై తీవ్రత, వంధ్యత్వం కనిపిస్తోంది. ఇక ఈ వ్యాధి ముదిరితే మూగజీవాలు చనిపోవడం ఖాయమని వైద్యాధికారులు చెబుతున్నారు.  ఇంతవరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనలేదని.. కాకపోతే ఇది మరీ ప్రమాదకర వైరస్ కాదని నివారణ చేస్తే తొందర్లోనే పశువులు కోలుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని ఆవులు, ఎద్దులకు సోకుతోందని రైతులు తొందరగా గుర్తించి వైద్య సిబ్బందికి తెలియచేస్తే నివారణ చర్యలు చేపడతామని అంటున్నారు.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!