రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు తింటున్నామో.. ఎప్పుడు పడుకుతున్నామో తెలియట్లేదు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుందాం అంటే ఏదో ఒక పని వచ్చి పడుతుంది. దానితో ప్రతిసారి ఆలస్యంగానే భోజనం చేస్తుంటాం. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం, లేకపోతే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతామని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్క బరువు పెరగడమే కాదు.. దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉందని సైంటిస్టులు తాజా పరిశోధనలో […]

  • Ravi Kiran
  • Publish Date - 3:49 am, Fri, 1 November 19
రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు తింటున్నామో.. ఎప్పుడు పడుకుతున్నామో తెలియట్లేదు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుందాం అంటే ఏదో ఒక పని వచ్చి పడుతుంది. దానితో ప్రతిసారి ఆలస్యంగానే భోజనం చేస్తుంటాం. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం, లేకపోతే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతామని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్క బరువు పెరగడమే కాదు.. దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉందని సైంటిస్టులు తాజా పరిశోధనలో తేల్చి చెప్పారు.

ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా రాత్రి పూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే 9 గంటల లోపే భోజనం ముగిస్తే మంచిదని వారు అంటున్నారు. అంతేకాకుండా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయన్నారు. అందుకే రాత్రి పూట పడుకోబోయే మూడు గంటల ముందు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. దీని వల్ల అరుగుదలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని.. అంతేకాకుండా నిద్ర కూడా సరిగ్గా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.