కరోనా లాక్‌డౌన్ తో.. డెయిరీ, పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. 

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల

కరోనా లాక్‌డౌన్ తో.. డెయిరీ, పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. 
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 6:19 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల డెయిరీ, పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బాలలకు పోషకాహారం అందజేయాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఈ రెండు రంగాల వ్యాపారానికి గట్టి హామీగా ఉంటోంది. ఈ మహమ్మారి అటు బాలలకు, ఇటు రైతులకు కష్టాలు మిగుల్చుతోంది.

వివరాల్లోకెళితే.. గుజరాత్‌లో దూద్ సంజీవని యోజనను విద్యార్థినీ, విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారు. కర్ణాటకలో క్షీర భాగ్య పథకం కింద పాఠశాలలు, అంగన్ వాడీల్లో చదువుతున్న బాలలకు పాలు పంపిణీ చేస్తారు. ఈ పథకాల కింద బాలలకు పాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణాలో అంగన్‌వాడీ బాలలకు వారానికి ఒక్కొక్కరికి 7 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఒడిశాలో 5, ఆంధ్ర ప్రదేశ్‌లో 4, తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, కర్ణాటకలో 2, బీహార్, త్రిపురలలో ఒకటి చొప్పున గుడ్లు ఇస్తున్నారు.

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో చదివే బాలలకు వారానికి ఒక్కొక్కరికి 5 గుడ్లు  ఇస్తున్నారు. తెలంగాణాలో వారానికి మూడుసార్లు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వారానికి రెండుసార్లు గుడ్లు ఇస్తున్నారు. కేరళ, బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరులలో వారానికి ఒకసారి గుడ్లు పంపిణీ చేస్తారు. దేశంలో రోజుకు 25 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో 2 కోట్ల గుడ్లకు కచ్చితమైన మార్కెట్‌గా పాఠశాలలు, అంగన్‌వాడీలు నిలుస్తున్నాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..