18,570 అడుగుల ఎత్తులో… 72 అడుగుల శివలింగం… శ్రీఖండ్ మహదేవ్!

సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే యాత్ర శ్రీఖండ్ యాత్ర. సముద్రమట్టానికి 18, 570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ ఈ యాత్రను భక్తులు చేపట్టడం విశేషం. కొలువైన మహాశివుడు మహాశివుడు ఇక్కడ కొలువై […]

18,570 అడుగుల ఎత్తులో... 72 అడుగుల శివలింగం... శ్రీఖండ్ మహదేవ్!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 5:56 PM

సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే యాత్ర శ్రీఖండ్ యాత్ర. సముద్రమట్టానికి 18, 570 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు హర..హర మహాదేవ అంటూ ఈ యాత్రను భక్తులు చేపట్టడం విశేషం.

కొలువైన మహాశివుడు

మహాశివుడు ఇక్కడ కొలువై ఉండటం మహా విశేషం. 75 అడుగుల ఎత్తు ఉన్న ఈ శివలింగ దర్శనానికంటే ముందే 50 అడుగుల దూరంలో పార్వతీదేవి, గణేషుడు, కార్తికేయ స్వామి వార్లను దర్శించుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు ఈ హిమాలయ పర్వతాలపై ధ్యానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ హిమాలయ పర్వతంపై ఉన్న శ్రీఖండ్ పర్వతాల్లో వెలసిన శివలింగంలో అద్భుత శక్తులున్నాయని స్థానికులు చెబుతుంటారు.

ఏడాది పొడవునా మంచు కురుస్తుంది

ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో మంచు కురిసినా ఈ శివలింగంపైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగిపోతుందని వారు చెబుతుంటారు. అద్భుతమైన పుష్పాలతో సందర్శకులని ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో బాగం శ్రీఖండ్ మహాదేవ్.

సముద్రమట్టానికి 6000 అడుగుల ఎత్తులో

హిమాచల్ ప్రదేశ్ లో, సముద్రమట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉండే సింగ్ హడ్ బేస్ క్యాంపు నుండి ఈ శ్రీఖండ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి 32 కిమీటర్ల దూరంలోని శ్రీఖండ్ మహదేవ్ ను దర్శించుకుని, వెనక్కు తిరిగి వచ్చేందుకు సుమారు 10 రోజుల సమయం పడుతుందంటే, అక్కడి వాతావరణ పరిస్థితులు, యాత్రలో కష్టాలను ఏమాత్రం ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఇది ఒక సాహసయాత్ర

హిమాలయన్ పర్వతాలపై యాత్ర కోసం వచ్చే భక్తులకు ఇది ఒక సాహసయాత్ర. ఎందుకంటే ఎత్తుకు ప్రయాణించే కొద్ది సరిగా ఆక్సిజన్ అందకపోవడంతో కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంత మంది భక్తులు త్వరగా అలసిపోతారు. శ్రీఖండ్ యాత్ర ప్రయాణం మార్గం మధ్యలో అనేక దేవాలయాలున్నాయి శ్రీఖండ్ యాత్ర ప్రయాణం మార్గం మధ్యలో అనేక దేవాలయాలున్నాయి. ఈ భక్తి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఈ యాత్రలో భాగంగా, పూర్తిగా మంచుతో కప్పబడిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కుల్లూ జిల్లా అధికార యంత్రాంగం ఈ యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా, పూర్తిగా మంచుతో కప్పబడిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన్ని భక్తులు దాటి వెళ్లాల్సి ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?

శ్రీఖండ్ మహాదేవ్ యొక్క ఈ పవిత్ర స్థలానికి చేరుకోవటానికి, భక్తులు మొదట సిమ్లా నుండి రాంపూర్ వరకు 130 కిలోమీటర్లు ప్రయాణించాలి, తరువాత రాంపూర్ నుండి నిరామండ్ వరకు 17 కిలోమీటర్ల దూరం దాటిన తరువాత, మళ్ళీ నీరమండ్ నుండి బాగిపుల్ వరకు 17 కిలోమీటర్ల వరకు ప్రయాణించాలి. వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. గంగూలీ చేరుకున్న తరువాత, 12 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఈమార్గాలన్నింటి ద్వారా ప్రయాణించిన తర్వాత 25మీటర్లు నేరుగా ట్రెక్కింగ్ చేయడం ద్వారా శ్రీఖండ్ ను చేరుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ ప్రయాణం భక్తులకు ఒక అగ్ని పరీక్ష వంటిదే. ఈ ప్రయాణంలో కొంత మంది భక్తులు శ్వాస సమస్యలను ఎదుర్కొంటుంటారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్