బట్టబయలవుతున్న రహస్యాలు,రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై చర్య తీసుకోవలసిందే ! శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్,

బట్టబయలవుతున్న రహస్యాలు,రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై చర్య తీసుకోవలసిందే ! శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్,

బాలాకోట్ విమానిక దాడుల గురించి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ముందే తెలుసునని, ఇది జాతీయ భద్రతకు ముప్పు తెచ్ఛే అంశమని..

Umakanth Rao

| Edited By: Ravi Kiran

Jan 18, 2021 | 2:22 PM

బాలాకోట్ విమానిక దాడుల గురించి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి ముందే తెలుసునని, ఇది జాతీయ భద్రతకు ముప్పు తెచ్ఛే అంశమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అర్నాబ్ కు, రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ  పార్థో దాస్ గుప్తాకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలో ఈ వైమానిక దాడుల విషయం మూడు రోజుల ముందుగానే ప్రస్తావనకు వచ్చిందన్నారు. 2019 ఫిబ్రవరి 26 న బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత విమానాలు దాడులు జరిపాయి. అయితే ఈ విధమైన సైనిక రహస్యాలు బయటివారికి తెలియకూడదని, కానీ అర్నాబ్ కి ఎలా తెలిశాయని ఆయన అన్నారు. ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని, సెక్యూరిటీకి ముప్పు తెచ్చేదన్నారు. అసలు సాధారణ జవాన్లకే ఇలాంటివి తెలిస్తే కోర్టు మార్షల్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపై రక్షణ, హోం మంత్రులు ఏం సమాధానమిస్తారని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అర్నాబ్ ని కోర్టు మార్షల్ చేయాలా అన్నారు. అసలు ఈ వాట్సాప్ చాటింగ్ మీకు ఎలా తెలిసిందన్న విషయమై వివరించేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఈ సంభాషణ లీక్ అయిందన్న విషయాన్ని ఆయన అంగీకరించారు.

Also Read:

Ramatheertham: రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టాపనలో కీలక ఘట్టం.. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించిన అధికారులు..

కొత్త కుర్రాళ్లు అదరగొట్టారు.. బౌలర్ సిరాజ్ బెదరగొట్టాడు.. కొనసాగుతోన్న టీమిండియా ఆధిపత్యం..

ప్రపంచ కరోనా అప్‌డేట్.. .. గడిచిన 24 గంటల్లో 5,32,236 పాజిటివ్ కేసులు, 9,192 మరణాలు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu