Shilpa Shetty: రూ.1.5 కోట్ల ఛీటింగ్‌ కేసుపై స్పందించిన శిల్ప.. ఇన్‌స్టాలో ఏం రాసుకొచ్చిందంటే..

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా కొన్ని నెలల క్రితం అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలలు జైలులో గడిపన అతను..

Shilpa Shetty: రూ.1.5 కోట్ల ఛీటింగ్‌ కేసుపై స్పందించిన శిల్ప.. ఇన్‌స్టాలో ఏం రాసుకొచ్చిందంటే..

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా కొన్ని నెలల క్రితం అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలలు జైలులో గడిపన అతను ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ ఘటన నుంచి త్వరగా తేరుకునేందుకు శిల్ప సినిమాలు, రియాలిటీషోలు చేస్తూ బిజీగా ఉంటోంది. అదే సమయంలో రాజ్‌ కుంద్రా తన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటినీ డిలీట్‌ చేసి ఇంట్లోనే ఉండిపోయాడు. పోర్నో గ్రఫీ కేసు విచారణ జరుగుతుండగానే శిల్పాశెట్టి దంపతులపై ముంబయిలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రూ.1.51 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. శిల్పాశెట్టి దంపతులు ప్రారంభించిన ఫిట్‌నెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం తన దగ్గర కోటీ 51లక్షల రూపాయలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదిరించారని ఆరోపిస్తూ ఓ వ్యాపారవేత్త వీరిపై కేసు పెట్టాడు. దీంతో బాంద్రా పోలీసులు శిల్పా దంపతులపై సెక్షన్ 420, సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 34 సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నా పరువు, ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయనే.. కాగా తనపై నమోదైన ఛీటింగ్‌ కేసులపై తాజాగా స్పందించింది శిల్ప. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘ నాతో పాటు నా భర్త రాజ్‌కుంద్రా మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసి షాక్‌కి గురయ్యాను. ఎస్‌ఎఫ్‌ఎల్ ఫిట్‌నెస్ అనేది కాషిఫ్ ఖాన్ నిర్వహిస్తున్న ఓ వెంచర్‌. అతను దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ జిమ్‌లను ప్రారంభించడానికి ఈ బ్రాండ్ హక్కులను తీసుకున్నాడు. ఇందులో భాగంగా అన్ని ఒప్పందాలు అతనే కుదుర్చుకున్నాడు. లావాదేవీలు కూడా అతనే నిర్వహించుకునేవాడు. వాటి గురించి నాకు కానీ, రాజ్‌కు గానీ ఏమీ తెలియదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మేం ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. ఇందలో పెట్టుబడి పెట్టిన అన్ని ఫ్రాంఛైజీలు నేరుగా కాషిఫ్‌తోనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2014లో ఈ కంపెనీ మూసివేసిన తర్వాత కూడా లావాదేవీలకు సంబంధించి అన్నీ కాషిఫే చూసుకున్నాడు. నేను గత 28 ఏళ్లుగా చాలా కష్టపడ్డాను. నా పరువు, ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయన్న కారణంతోనే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చింది శిల్ప.

Also read:

Suriya Jai Bheem: వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..

Aliabhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం వెనక్కు తగ్గిన గంగూబాయి.. విడుదల ఎప్పుడంటే..

Lakshmi Manchu: మలయాళంలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తోన్న మంచు లక్ష్మీ.. మోహన్‌లాల్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన..

Published On - 2:19 pm, Mon, 15 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu