“అతను ఓ నిస్సహాయ ముఖ్యమంత్రి”: శశి థరూర్

పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థులపై ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను కలవడంలో విఫలమైనందుకు ఆయనను “నిస్సహాయ ముఖ్యమంత్రి” అని సంబోధించారు. ‘ప్రజలు ఏ ప్రాతిపదికన ఆయనకు ఓటు వేయాలి, ఈ విషయం గురించి మాట్లాడలేకపోతే’ అని థరూర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ పై మండిపడ్డారు. ఆదివారం, ముసుగు గుండాలు జెఎన్‌యు క్యాంపస్‌లోకి […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:06 am, Sat, 11 January 20
"అతను ఓ నిస్సహాయ ముఖ్యమంత్రి": శశి థరూర్

పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థులపై ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను కలవడంలో విఫలమైనందుకు ఆయనను “నిస్సహాయ ముఖ్యమంత్రి” అని సంబోధించారు. ‘ప్రజలు ఏ ప్రాతిపదికన ఆయనకు ఓటు వేయాలి, ఈ విషయం గురించి మాట్లాడలేకపోతే’ అని థరూర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ పై మండిపడ్డారు.

ఆదివారం, ముసుగు గుండాలు జెఎన్‌యు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో 30 మందికి పైగా గాయపడ్డారు. జెఎన్‌యు దాడిపై స్పందించిన కేజ్రీవాల్, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

అయితే.. “అతను (కేజ్రీవాల్) ఎవరి ఆదేశాలు స్వీకరిస్తున్నాడో నాకు తెలియదు. విద్యార్థులపై జరిగిన దాడుల గురించి మాట్లాడవద్దని, గాయపడిన విద్యార్థులను కలవవద్దని, సిఎఎపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోకూడదని మిమ్మల్ని (కేజ్రీవాల్) ఎవరు అడిగారు? మీరు సిఎం.. మిమ్మల్ని ఎవరూ ఆదేశించలేరు, ”అని థరూర్ పేర్కొన్నారు.

ఈ నెల ప్రారంభంలో, పౌరసత్వ చట్టంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “సవరించిన పౌరసత్వ చట్టం నాకు అర్థం కాలేదు. అమిత్ షా దీని గురించి ఎప్పుడు మాట్లాడుతారు? ఇళ్ళు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు మూతబడిపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న 2 కోట్ల మంది హిందువులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఎంతవరకు సబబు” అని ఆరోపించారు. ఫిబ్రవరి 8 న ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11 న ఫలితాలు ప్రకటించబడతాయి.