ధోని ఎప్పటికీ ఓ లెజెండే: షేన్ వాట్సన్

ధోని ఎప్పటికీ ఓ లెజెండే: షేన్ వాట్సన్

క్రికెట్ దిగ్గజాలు, యువ క్రికెటర్లు, సహచర ప్లేయర్స్.. ఇలా ఎవరైనా కూడా భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని పొగడకుండా ఉండలేరు.

Ravi Kiran

|

Aug 12, 2020 | 9:32 PM

Shane Watson Comments On MS Dhoni: క్రికెట్ దిగ్గజాలు, యువ క్రికెటర్లు, సహచర ప్లేయర్స్.. ఇలా ఎవరైనా కూడా భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని పొగడకుండా ఉండలేరు. కెప్టెన్లకు, ఆటగాళ్లకు ధోని ఓ ఇన్స్పిరేషన్. జట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా.. కూల్‌గా వికెట్ల వెనుక నుంచి ప్రణాళికలు రచించడంలోనే కాదు.. మ్యాచ్‌ను తన వైపుకు తిప్పుకునే సామర్ధ్యం ఒక్క ధోనిలోనే ఉందని అందరూ నమ్ముతారు. ఇక తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ ధోనిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

”ధోని ఇప్పటికీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నాడని చెప్పిన వాట్సన్.. అతడు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఆటగాడని వ్యాఖ్యానించాడు. అతడికి వయసుతో సంబంధం లేదని, 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా అద్భుతంగా రాణించగలడని ఆశిస్తున్నానని.. ఆ నమ్మకం తనకు ఉందని” తెలిపాడు. టీంతో కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వాట్సన్ చెప్పాడు. కాగా, యూఏఈకి పయనమయ్యే మొదటి ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కావడం విశేషం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu