ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏడుగురు సభ్యులతో టీ కాంగ్రెస్ కమిటీ, అభ్యర్ధుల ఎంపికలో ఏకాభిప్రాయం కోసం కొత్త స్టెప్పు

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌లో హీట్‌ను క్రియేట్‌ చేశాయి. మొదటి నుంచీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో..

  • Venkata Narayana
  • Publish Date - 9:14 pm, Fri, 22 January 21
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏడుగురు సభ్యులతో టీ కాంగ్రెస్ కమిటీ, అభ్యర్ధుల ఎంపికలో ఏకాభిప్రాయం కోసం కొత్త స్టెప్పు

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌లో హీట్‌ను కొత్త వేడిని పుట్టిస్తున్నాయి. మొదటి నుంచీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీలో లొల్లి కొనసాగుతోంది. సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కొందరు, ప్రొఫెసర్‌ కోదండరాంకు కాంగ్రెస్‌ నుంచి అవకాశం కల్పించాలని ఇంకొందరు పట్టుబడుతున్న నేపథ్యంలో, అభ్యర్ధుల ఎంపికకు ఏడుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్‌ మండలి ఎన్నికల అభ్యర్థుల సిఫారసుల బాధ్యత కమిటీ చూసుకోనుంది. కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, కుసుమ కుమార్‌, అజారుద్దీన్‌లు ఉన్నారు. జీవన్‌రెడ్డి కమిటీ అభ్యర్థులను పరిశీలించి పేర్లను అధిష్టానానికి సిఫారసు చేయనుంది. కమిటీ చేసిన సిఫారసు ఆధారంగా అభ్యర్థులను అధిష్టానం నిర్ణయించనుంది. ప్రతీ ఒక్కరితో చర్చించాకే ఏకాభిప్రాయం తీసుకుని అభ్యర్ధిని ఎంపిక చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు. కోదండరాంకు మద్దతు ఇవ్వాలా లేదా అన్నది హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు.