కర్నాటకలో ఏడు తలల పాము.. చూసిన జనం ఏం చేశారంటే..?

కర్నాటకలో ఏడు తలల పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. మరి కొందరు పూజలు చేస్తారు. కర్ణాటకలోని కనకపుర సమీపంలో మరిగౌడన దొడ్డి గ్రామంలో 7 తలల నాగుపాము కుబుసం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. దీంతో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలకు పాకింది. ఏడు తలల పామును చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి క్యూ కట్టారు. ఇంకేముంది.. ఇది నిజంగా దేవుని మహిమే […]

కర్నాటకలో ఏడు తలల పాము.. చూసిన జనం ఏం చేశారంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 2:05 PM

కర్నాటకలో ఏడు తలల పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. మరి కొందరు పూజలు చేస్తారు. కర్ణాటకలోని కనకపుర సమీపంలో మరిగౌడన దొడ్డి గ్రామంలో 7 తలల నాగుపాము కుబుసం స్థానికులను ఆశ్యర్యానికి గురిచేసింది. దీంతో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలకు పాకింది. ఏడు తలల పామును చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి క్యూ కట్టారు. ఇంకేముంది.. ఇది నిజంగా దేవుని మహిమే అంటూ పసుపు, కుంకుమ చల్లి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు.

అంతేకాదు.. 6 నెలల క్రితం కూడా అక్కడ ఏడు తలల నాగుపాము కుబుసం కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రదేశం మహిమాన్విత ప్రదేశంగా వారు భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం విష్ణుమూర్తి కూడా ఏడు తలల పాము పైనే నిద్రిస్తాడు కాబట్టి.. మరిగౌడన దొడ్డి గ్రామంలో కనిపించింది ఏడు తలల పాము కుబుసమే అని వాదిస్తున్నారు. బాలప్ప అనే రైతు పొలానికి దగ్గర్లో 7 తలల పాము కుబుసం కన్పించడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఓకింత భయంతోనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని పూజలు చేయడం ప్రారంభించారు. అవన్నీ తలభాగంలో ఉండడంతో అది ఏడు తలల పాము వదిలిన కుబుసమే అని ఇక్కడి స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు.

అయితే ఈ ఏడు తలల పాము పై నిపుణులు భిన్న వాదన వినిపిస్తున్నారు. ఏడు తలల పాము అనేది పురాణాల వరకే పరిమితం అని, వాస్తవానికి అవి ఉనికిలో లేవంటున్నారు. కానీ ఇక్కడ దొరికిన ఆధారాలను,.. కుబుసాన్ని పరిశీలిస్తే. ఒకే పాముకు అనేక తలలు ఉన్న విషయం స్పష్టమవుతోంది. శాస్త్రవేత్తలు సైతం ఇక్కడకు వచ్చి పరిశోధనలు చేస్తున్నారు అంటే ఈ ఏడు తల పాము కూడా దైవంశ సంభూతం అని కూడా అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.