Covishield Vaccine: వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న సీరం సీఈఓ.. వ్యాక్సిన్ నాణ్యతకు తానే నిదర్శనమని ప్రకటన

తమ సీరం  కంపెనీ ఉత్పత్తి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ఈ సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తీసుకున్నారు. శనివారం దేశవ్యాప్తంగా..

Covishield Vaccine: వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న సీరం సీఈఓ.. వ్యాక్సిన్ నాణ్యతకు తానే నిదర్శనమని ప్రకటన
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 16, 2021 | 4:27 PM

తమ సీరం  కంపెనీ ఉత్పత్తి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ఈ సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తీసుకున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ  వ్యాక్సినేషన్ ని లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే  ఆయన స్వయంగా తను కూడా ఈ టీకామందు తీసుకున్నారు.  తొలిదశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి ఉద్దేశించిన ఈ కోవీషీల్డ్ నాణ్యతకు, రక్షణకు పూర్తిగా దోహదపడుతుందని చాటేందుకు తనీ మందును తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతి  పెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ని ఇండియా, ప్రధాని మోదీ చేబట్టిన ఈ సందర్భం ఎంతో గర్వ కారణమని, ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో తమ టీకామందు ఓ భాగమని ఆయన అన్నారు. నేను కూడా  హెల్త్ వర్కర్లలో ఓ బాగమయ్యాను.. వారిలో జాయిన్ అయ్యాను అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు కోవీ షీల్డ్ వ్యాక్సిన్ కే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులోని ప్రొటెక్షన్ ఇతర వ్యాక్సిన్లకన్నా శ్రేష్టమైనదని పేర్కొంటున్నాయి.