అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. బడ్జెట్ ప్రతికూలతలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం, ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా సూచీల పతనానికి కారణమయ్యాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే కుప్పకూలిన మార్కెట్లు.. అంతకంతకూ దిగజారుతూ భారీగా నష్టపోయాయి.
సెన్సెక్స్ ఏకంగా 793 పాయింట్లు నష్టపోయి 38,720 వద్ద, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,558 వద్ద ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్30లో కేవలం యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తప్ప అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 9శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గత 9 నెలల్లో సూచీలు ఒక రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఈ రోజే.
https://twitter.com/GoodReturnsIN/status/1148172454667251713