ఏలూరులో టెన్షన్.. టెన్షన్.. వింత వ్యాధిపై టీవీ9 శోధనలో సంచలనలు..వింత వ్యాధి మిస్టరీ మూలం ఇక్కడే..

ఏలూరు వింత వ్యాధిపై టీవీ9 శోధనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కళ్లు తిరగడం, కూలబడిపోవడం, నురగకక్కడం, ఫిట్స్‌ టైప్‌లో విలవిల్లాడడం.. ఇవన్నీ 5 రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి అనుకుంటున్నాం..

  • Sanjay Kasula
  • Publish Date - 7:03 am, Thu, 10 December 20
ఏలూరులో టెన్షన్.. టెన్షన్.. వింత వ్యాధిపై టీవీ9 శోధనలో సంచలనలు..వింత వ్యాధి మిస్టరీ మూలం ఇక్కడే..

Tv9 Research : ఏలూరు వింత వ్యాధిపై టీవీ9 శోధనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కళ్లు తిరగడం, కూలబడిపోవడం, నురగకక్కడం, ఫిట్స్‌ టైప్‌లో విలవిల్లాడడం.. ఇవన్నీ 5 రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన వింత వ్యాధి అనుకుంటున్నాం అంతా. కానీ..కాదట. 15, 20 రోజుల క్రితం నుంచే ఈ వ్యాధి జనంలోకి వచ్చింది. కానీ ఒకరిద్దరితో మొదలు కావడంతో అంతా ఇదో జబ్బు అయ్యి ఉంటుందనుకున్నారు గానీ.. దాని ప్రభావం ముందు ముందు ఈ స్థాయిలో ఉంటుందని, ఊరు ఊరునే వణికిస్తుందని ఎవరూ ఊహించలేదు.

అన్నింటికంటే మించి వ్యాధి మూలం కూడా ఎక్కడుందో టీవీ9 కనిపెట్టే ప్రయత్నం చేసింది. పంపుల చెరువు.. ! ఆ చెరువులోనే అసలు వ్యాధి మూలం ఉన్నట్లు అనుమానంగా ఉంది. పంపుల చెరువులో పనిచేస్తున్న సిబ్బంది 15రోజుల క్రితమే ఈ వ్యాధి బారిన పడ్డట్లు తెలుస్తోంది. దక్షిణవీధి పంపుల చెరువు నీళ్ల శాంపిల్స్‌ను తీసుకొని ల్యాబ్‌కు పంపారు అధికారులు. ల్యాబ్‌ రిపోర్ట్స్‌ వస్తే వింత వ్యాధి మూలాలు బయటపడే అవకాశం ఉంది.

మరోవైపు వింత వ్యాధి కేసులు తగ్గినట్టే తగ్గి…మళ్లీ గంటగంటకూ పెరుగుతున్నాయి. తాజాగా ఏలూరులో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. నీళ్లు, అన్నం, కూరగాయల్లో కెమికల్స్‌ ఉన్నాయేమోనన్న అనుమానంతో బాధితులు అర్ధరాత్రి నుంచి తిండి కూడా మానేశారు. అటు వింత వ్యాధి బాధితుల సంఖ్య 590 దాటింది.

ఇప్పటికే 500 మందికి పైగా డిశ్చార్జ్‌ అయితే… ప్రస్తుతం ఆస్పత్రిలో 46 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. బాధితులు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అస్వస్థతకు గల కారణాలను త్వరగా కనుక్కోవాలని సీఎం ఆదేశించారు. అటు డబ్ల్యూహెచ్‌వోతో సహా పలు రంగాల నిపుణులంతా అసలు ఈ వింతవ్యాధికి కారణాలేంటో కనుకునే పనిలోనే ఉన్నారు.