ఇది మనసుని కలచి వేసిన ఘటన: చిరంజీవి

ఇది మనసుని కలచి వేసిన ఘటన: చిరంజీవి

విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై స్పందించారు ప్రముఖ హీరో చిరంజీవి. విశాఖలో విషవాయువు స్టెరిన్ బారిన పడి ప్రజలు మరణించటం మనసుని కలిచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 07, 2020 | 11:07 AM

విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై స్పందించారు ప్రముఖ హీరో చిరంజీవి. విశాఖలో విషవాయువు స్టెరిన్ బారిన పడి ప్రజలు మరణించటం మనసుని కలిచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు చిరంజీవి. అలాగే అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు చిరంజీవి.

కాగా ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, సీఎం జగన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తదితరులు స్పందించారు. అలాగే విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జగన్‌ వైజాగ్ వెళ్లనున్నారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందగా, 80 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Read More:

మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu