కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు కరోనా
Ram Naramaneni

|

Oct 01, 2020 | 7:28 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తనను కాంటాక్ట్‌ అయినవాళ్లందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులకు కరోనా సోకింది. పలువరు బీజేపీ నేతలు, కేంద్ర పెద్దలు కూడా కరోనా బారిన పడ్డారు.  అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీకి కూడా కోవిడ్ సోకింది. చికిత్స అనంతరం వారు వ్యాధి బారి నుంచి రికవర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కూడా రెండు రోజుల కింద కరోనా సోకింది.

Also Read :

దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాలు

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu