పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల అభ్యంతరాలను తోసిపుచ్చిన సెనేట్, జో బైడెన్ దే విజయం, ట్రంప్ పై ‘జో’ ఫైర్

అమెరికా ఎన్నికల్లో ముఖ్యంగా పెన్సిల్వేనియా లో జో బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ రిపబ్లికన్లు వెలిబుచ్చిన అభ్యంతరాలను సెనేట్ తోసిపుచ్చింది.

  • Umakanth Rao
  • Publish Date - 12:20 pm, Thu, 7 January 21
పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల అభ్యంతరాలను తోసిపుచ్చిన సెనేట్, జో బైడెన్ దే విజయం, ట్రంప్ పై 'జో' ఫైర్

అమెరికా ఎన్నికల్లో ముఖ్యంగా పెన్సిల్వేనియా లో జో బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ రిపబ్లికన్లు వెలిబుచ్చిన అభ్యంతరాలను సెనేట్ తోసిపుచ్చింది. అర్ధరాత్రి దాటాక బైడెన్ విక్టరీకి అనుకూలంగా 92 మంది, వ్యతిరేకంగా ఏడుగురు ఓటు చేశారు. పెన్సిల్వేనియా ఎలెక్టోరల్ ఓట్లలో ఫ్రాడ్ జరిగిందన్న ఆరోపణను  సెనేట్ తిరస్కరించింది. కాగా సభ ఇంకా డిబేట్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అభ్యంతరాల ను మాత్రం సభ తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాజ్యాంగానికి మద్దతునివ్వండి, జో బైడెన్:

డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉసి గొల్పడాన్ని అధ్యక్షుడు కానున్న జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ద్వేషాన్ని, ఆందోళనలను రెచ్ఛగొట్టవద్దని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. ట్రంప్ మూకను ఆయన తీవ్రవాదులుగా. అల్లర్లను ప్రేరేపించేవారిగా అభివర్ణించారు. క్యాపిటల్ వద్ద జరిగిన ఘటనలు  అమెరికాను ప్రతిబింబించరాదని, ఇది డెమొక్రసీపై జరిగిన దాడే అని అన్నారు. మీరు నేషనల్ టీవీలో మాట్లాడి మీ మద్దతుదారులను అదుపులో ఉండాలని కోరాలన్నారు.    ఇది దేశ ద్రోహమని, ఈ గుంపులన్నీ వెళ్ళిపోయి సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రపంచం, మన పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలని జో బైడెన్..ట్రంప్ ను అభ్యర్థించారు. ఈ విధమైన ఘటనలను తాము ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.