Akhila Priya : అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురు.. పోలీసు కస్టడీకి మాజీ మంత్రి

మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయడంతో విచారణ జరిపింది. ఇందులో భాగంగానే మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్‌ కోర్టు తీర్పిచ్చింది.

Akhila Priya : అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురు.. పోలీసు కస్టడీకి మాజీ మంత్రి
Follow us

|

Updated on: Jan 11, 2021 | 11:53 AM

Akhila Priya into Police Custody : మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయడంతో విచారణ జరిపింది. ఇందులో భాగంగానే మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్‌ కోర్టు తీర్పిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 1.30గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలీసులు కస్టడీలో ఉంటుంది అఖిలప్రియ.

ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సింది చాలా ఉందని , కిడ్నాప్‌పై సీన్‌ రీకన్స్‌ స్ట్రక్షన్‌తో పాటు ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో తెలుసుకుంటామంటూ కోర్టుకు తెలిపారు. అలాగే ప్రవీణ్ రావు సోదరులతో చేయించుకున్న సంతకాల పేపర్లను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని…A3గా ఉన్న భార్గవ్‌రామ్‌ పరారీలో ఉండటంతో అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందని పోలీసులంటున్నారు.

బెయిల్‌పై జడ్జిమెంట్‌ రాకముందే భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నాడో చెప్పాలని…మీరే స్వయంగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని చెప్పారు భార్గవ్‌రామ్ తండ్రి మురళినాయుడు. ఈవ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని తమను ఇరికించి వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారం వెనుక చాలా మంది పెద్దల హస్తముందన్నారు. పోలీసులు బెదిరించడానికి మేము ఏం నేరస్తులం కాదని…టెర్రరిస్టులం అంతకన్నా కాదన్నారు.

తల్లిదండ్రులు లేని తమ కోడలు ఫ్యామిలీకి అండగా ఉండటం వల్లే భార్గవ్‌పై క్రిమినల్‌ ముద్రవేశారని భార్గవ్‌రామ్ పేరెంట్స్ అంటున్నారు. ఈకేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయతే కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు భార్గవ్‌రామ్‌ తండ్రి మురళీనాయుడ్ని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.