విశాఖను భయపెడుతున్న కొత్త వ్యాధి.. జనాల్లో హడల్..

Scrub Typhus In Vizag: ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోపక్క విశాఖలో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఈ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ డిసీజ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మనుషులకు ఈ వ్యాధి సోకగానే.. ముందుగా వారిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఆ తర్వాత శరీరంపై దదుర్లు కూడా వస్తాయి. తాజాగా విశాఖ […]

  • Updated On - 1:10 pm, Sat, 12 September 20
విశాఖను భయపెడుతున్న కొత్త వ్యాధి.. జనాల్లో హడల్..

Scrub Typhus In Vizag: ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోపక్క విశాఖలో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఈ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ డిసీజ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మనుషులకు ఈ వ్యాధి సోకగానే.. ముందుగా వారిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఆ తర్వాత శరీరంపై దదుర్లు కూడా వస్తాయి. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించడం జరిగింది. మొదటగా వారికి వచ్చినవి కోవిడ్ లక్షణాలుగా భావించి.. వైద్యులు టెస్టులు చేశారు. అయితే రిపోర్టులలో కరోనా నెగటివ్ వచ్చింది.

సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆగష్టు నుంచి నవంబర్ వరకు సీజనల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే పరీక్షలు జరపగా.. మలేరియా, డెంగ్యూలకు కూడా నెగటివ్ వచ్చింది. అసలు ఈ సిమ‌్‌టమ్స్ దేని వల్ల వచ్చాయోనని పలువురు నిపుణులు అధ్యయనం చేయగా.. స్క్రబ్ టైఫస్ అని తేలింది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే యాంటీ బయోటిక్ ఇంజక్షన్‌తో నయం చేయవచ్చునని.. ఆలస్యమైతే మాత్రం దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ వైరస్ కరోనా మాదిరిగా తీవ్రమైనది కాదని.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వారు అన్నారు. కాగా, ఈ వ్యాధి నేపాల్, కోల్ కతా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో బయటపడింది.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!