తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడేనా.?

అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్స్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం నవంబర్ 2న పాఠశాలలు...

తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడేనా.?
Follow us

|

Updated on: Oct 04, 2020 | 2:37 PM

Schools Re-Open Telangana: అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్స్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం నవంబర్ 2న పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తులు మొదలుపెట్టింది. అలాగే తెలంగాణలో కూడా నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.  (ఏపీ: పాఠశాలలో పరేషాన్.. 20 మంది విద్యార్థులకు కరోనా..)

స్కూల్స్ తెరవడంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 7వ తేదీన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నవంబర్ 2 నుంచి మొదటిగా 9,10 తరగతులకు క్లాసులు ప్రారంభించి.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మిగతా తరగతులు నిర్వహించాలని భావిస్తోందట. (జగనన్న విద్యా కానుక మరోసారి వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.!)