Scholarship Date Etended: స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల గడువును పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం.. చివరి తేది ఎప్పుడంటే..

Scholarship Registration Date In TS: ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థుల కోసం గడువును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Scholarship Date Etended: స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల గడువును పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం.. చివరి తేది ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 8:30 PM

Scholarship Registration Date In TS: ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థుల కోసం గడువును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-2021 విద్యాసంవత్సరానికి గాను స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడగిస్తూ ప్రకటన చేశారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, శారీరక వైకల్యం గల విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన మొత్తం 1,36,937 మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు కేవలం 59,813 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో దరఖాస్తుల గడువును పొడగించినట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ గురువారం వెల్లడించింది. కొవిడ్19 నిబంధనల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయని, ప్రస్తుతం విద్యా సంస్థలు ఇంకా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. ‘స్కాలర్ షిప్‌ల దరఖాస్తు చివరి తేదిపై విద్యార్థుల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఈపాస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, అలాగే కొన్ని డిగ్రీ, పీజీ కోర్సులను ఇంకా అడ్మిషన్లు కూడా పూర్తి కానీ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ల గడువును ఫిబ్రవరి 15కు పొడగించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: తొలిసారి ఇండియాలోనూ మిస్టీరియస్ ‘మోనోలిథ్’, అహ్మదాబాద్ లో ప్రత్యక్షం ! పబ్లిక్ పార్క్ లో వింత, అంతా ఆశ్చర్యం