ఎస్‌బీఐలో సూప‌ర్ జాబ్స్..అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్..!

ఎస్‌బీఐలో యువతకు సూప‌ర్ ఆఫ‌ర్ అందుబాటులో ఉంది. ఖాళీగా ఉన్న‌ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు బ్యాంక్‌ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈరోజుతో అంటే జూలై 13న అప్లికేష‌న్ గడువు ముగుస్తోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 4:55 pm, Mon, 13 July 20
ఎస్‌బీఐలో సూప‌ర్ జాబ్స్..అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్..!

ఎస్‌బీఐలో యువతకు సూప‌ర్ ఆఫ‌ర్ అందుబాటులో ఉంది. ఖాళీగా ఉన్న‌ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు బ్యాంక్‌ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈరోజుతో అంటే జూలై 13న అప్లికేష‌న్ గడువు ముగుస్తోంది. దేశీయ‌ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లు 241, సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 85 ఖాళీగా ఉన్నాయ‌ని..వాటిని భ‌ర్తీ చేయ‌బోతున్న‌ట్లు వివ‌రించింది. అంతేకాకుండా వీరికి ఎంత శాలరీ ఇవ్వనుందో కూడా బ్యాంక్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ అధికారికి రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీని ఇవ్వబోతున్న‌ట్లు తెలిపింది. ఇక‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌కు అయితే వార్షిక వేతన ప్యాకేజీ రూ.10 లక్షలుగా నిర్ణ‌యించింది. ఎగ్జిక్యూటివ్ జాబ్స్‌కు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌కు అయితే డిగ్రీతో పాటు మూడేళ్ల వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్ ఉండాలి.

ఎగ్జిక్యూటివ్ జాబ్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాలంటే 30 ఏళ్లలోపు వయసు ఉండాలనే నింబంధ‌న ఉంది. అదే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు అయితే 35 ఏళ్ల వయసు మించ‌కూడ‌దు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్ల‌ను ఫైన‌ల్ చేస్తారు. పూర్తి వివ‌రాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి… అర్హులైతే ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.