ఎస్​బీఐ షాకింగ్ డెషిస‌న్..హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెంపు..

ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. రెపో ఆధారిత హోమ్ లోన్స్ వ‌డ్డీ రేటును 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీనితో పాటు ఆస్తిని తాక‌ట్టు పెట్టుకుని ఇచ్చే ప‌ర్స‌న‌ల్ లోన్స్ పైనా వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్​ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్​) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 1 నుంచే వర్తిస్తాయని ఎస్​బీఐ స్ప‌ష్టం చేసింది. కరోనా సంక్షోభం వేళ‌… లోన్స్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:47 pm, Fri, 8 May 20
ఎస్​బీఐ షాకింగ్ డెషిస‌న్..హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెంపు..

ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. రెపో ఆధారిత హోమ్ లోన్స్ వ‌డ్డీ రేటును 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీనితో పాటు ఆస్తిని తాక‌ట్టు పెట్టుకుని ఇచ్చే ప‌ర్స‌న‌ల్ లోన్స్ పైనా వడ్డీరేట్లను 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్​ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్​) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 1 నుంచే వర్తిస్తాయని ఎస్​బీఐ స్ప‌ష్టం చేసింది.

కరోనా సంక్షోభం వేళ‌… లోన్స్ తీసుకున్నవారి నుంచి, రియల్టీ సంస్థల నుంచి క్రెడిట్‌ రిస్క్‌ పెరిగే ఛాన్స్ ఉందన్న మార్కెట్‌ వర్గాల విశ్లేషణల నేపథ్యంలో.. ఎస్​బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ఎస్​బీఐని ఇతర బ్యాంకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.