ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక…

ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక...

దేశ రాజధాని ఢిల్లీలో ఎస్బీఐ కార్డులను క్లోనింగ్ చేసి ఖాతాదారుల సొమ్మును అకౌంట్‌ నుంచి కొల్లగోట్టినట్లు పలు కంప్లయింట్లు రావడంతో ఎస్బీఐ మిగతా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. కార్డులు క్లోనింగ్ ద్వారా డబ్బులు కోల్పోయినవారికి తిరిగి సొమ్మును రీఫండ్ చేస్తామన్నారు. మరోవైపు మిగిలిన ఖాతాదారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. రెగ్యులర్‌గా ఏటీఎం పిన్ మార్చుకోవడమే కాకుండా పిన్ ఎంటర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంది. అంతేకాక ఏటీఎం కార్డుపై […]

Ravi Kiran

|

May 13, 2020 | 2:30 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎస్బీఐ కార్డులను క్లోనింగ్ చేసి ఖాతాదారుల సొమ్మును అకౌంట్‌ నుంచి కొల్లగోట్టినట్లు పలు కంప్లయింట్లు రావడంతో ఎస్బీఐ మిగతా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. కార్డులు క్లోనింగ్ ద్వారా డబ్బులు కోల్పోయినవారికి తిరిగి సొమ్మును రీఫండ్ చేస్తామన్నారు.

మరోవైపు మిగిలిన ఖాతాదారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరించింది. రెగ్యులర్‌గా ఏటీఎం పిన్ మార్చుకోవడమే కాకుండా పిన్ ఎంటర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంది. అంతేకాక ఏటీఎం కార్డుపై పిన్ నెంబర్ రాయవద్దని.. పుట్టినరోజులు, పెళ్లి రోజులను పిన్ నెంబర్లుగా పెట్టుకోవద్దని తెలిపింది. అటు ఓటీపీ గానీ, ఏటీఎం పిన్ నెంబర్లను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయవద్దని ఎస్బీఐ వెల్లడించింది.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu