పరప్పణ అగ్రహారంలో పాచికలు.. చిన్నమ్మ గూటిలో సంథింగ్‌ స్పెషల్‌.. తమిళక్షేత్రంలో రాజకీయ రణరంగం..

ఈసారి అమ్మలేదు. అన్నాడీఎంకేకి ఆమె బొమ్మే మిగిలింది. కానీ చిన్నమ్మ ఉంది. జైలు గోడల మధ్య నుంచి బయటికొచ్చి లైవ్‌ పాలిటిక్స్‌ నడపబోతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు..

పరప్పణ అగ్రహారంలో పాచికలు.. చిన్నమ్మ గూటిలో సంథింగ్‌ స్పెషల్‌.. తమిళక్షేత్రంలో రాజకీయ రణరంగం..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 8:48 PM

ఈసారి అమ్మలేదు. అన్నాడీఎంకేకి ఆమె బొమ్మే మిగిలింది. కానీ చిన్నమ్మ ఉంది. జైలు గోడల మధ్య నుంచి బయటికొచ్చి లైవ్‌ పాలిటిక్స్‌ నడపబోతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమార్జన కేసులో జైలుపాలైన జయలలిత సహచరి శశికళ ఈనెల 27న రిలీజ్‌ కాబోతున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌. చిన్నమ్మతో పాటు మిగిలిన ఇద్దరూ బయటికి రాబోతున్నారు. చిన్నమ్మ జైలుపాలుకాగానే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో కొత్త పార్టీ పెట్టారు శశికళ మేనల్లుడు దినకరన్‌. ఇప్పుడు ఏఎంఎంకేని చిన్నమ్మ ఎలాంటి వ్యూహంతో ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తిరేపుతోంది.

జైలుకెళ్లేముందు జయలలిత సమాధిని చరిచి ప్రమాణంచేసిన శశికళ… తమిళనాట కీలకం కాబోతున్నారు. ప్రస్తుత సీఎం పళనిస్వామిని అప్పట్లో సీఎం సీట్లో కూర్చోబెట్టింది శశికళనే. అయితే ఒకప్పుడు ఒంగిఒంగి దండాలు పెట్టినవాళ్లు ఇప్పుడు నిటారుగా నిలబడ్డారు. ఓ వైపు అమ్మ పార్టీ, మరోవైపు చిన్నమ్మపార్టీ. అన్నాడీఎంకేలో ఉంటూనే శశికళ కాళ్లుమొక్కే నేతలున్నారు. శశికళ బయటికి రాగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు పార్టీ వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

చిన్నమ్మ బయటికొచ్చాక ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు నిద్రపట్టటం లేదు. ఓ దశలో ఇద్దరి మధ్య నాయకత్వపోరు జరిగినా…పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందేమోనని భయపడి…చివరికి రాజీపడ్డారు. సర్వసభ్య సమావేశంతో శనివారం అన్నాడీఎంకే అగ్రనేతలంతా ఓ వేదికపైకొచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు జరిపారు. శశికళ రిలీజ్‌ తర్వాత పరిణామాలపైనా చర్చించారు. 11 మందితో స్టీరింగ్‌ కమిటీని ఆమోదించారు. మొత్తం 16 తీర్మానాలు చేశారు. ఎన్నికల్లో పార్టీలతో పొత్తు వ్యవహారాలపై సర్వాధికారాలను పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు కట్టబెట్టారు.

అన్నాడీఎంకే నేతల తీరుపై బీజేపీతో పాటు పీఎంకే, డీఎండీకే పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో మిత్రపక్షాలను బుజ్జగించబోతున్నారు ఈపీఎస్‌, ఓపీఎస్‌. పీఎంకే కూడా తమకు డిప్యూటీ సీఎం పదవి కావాలంటోంది. వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఒత్తిడి ఉంది. ఓవైపు శశికళతో తలపడుతూనే…సొంతింటి సవాళ్లను పళని, పన్నీర్‌ ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఇవి కూడా చూడండి :

Chang’e 4 Mission : చికటి నుంచి వెలుగులోకి చాంగే-4 ల్యాండర్.. పరిశోధనలు మళ్లీ షురూ Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..