యోగాతో ఫుల్ రిలాక్స్ అంటున్న సారా..

సారా అలీ ఖాన్.. పటౌడీ ఫ్యామిలీ నుంచీ దూసుకొస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ. కేదార్‌నాథ్, సింబా సినిమాలతో హల్‌చల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ.. గారాలపట్టీ... 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. అయితే ఈ ఏడాది...

యోగాతో ఫుల్ రిలాక్స్ అంటున్న సారా..

సారా అలీ ఖాన్.. పటౌడీ ఫ్యామిలీ నుంచీ దూసుకొస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ. కేదార్‌నాథ్, సింబా సినిమాలతో హల్‌చల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ.. గారాలపట్టీ… 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. అయితే ఈ ఏడాది ఒకటి కూలీ నంబర్ 1. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. కూలీ నంబర్ 1… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే ఫుట్ టు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది ఈ చిన్నది.  వాలంటైన్ డే రోజు ప్రేమికులను ఆకట్టుకునేందుకు అట్రాంగి రీ విడుదల చేస్తున్నారు. ఇది రొమాంటిక్ డ్రామా మూవీ .. ఇందులో సారా డ్యూయల్ రోల్ పోషిస్తోంది.  అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి మెప్పించేందుకు సిద్ధమవుతోంది.

సినిమాలతో బిజీగా ఉంటూనే పనిలో పనిగా బికినీలో కవ్విస్తూ హాట్ ఫోటోషూట్స్ కూడా పోస్ట్ చేస్తుంది సారా అలీ ఖాన్. ఇప్పుడు తాజాగా మరో మరోసారి రెడ్ కలర్ ట్రాక్‌లో సందడి చేసింది. స్విమ్మింగ్ ఫూల్ పై యోగా చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. వృక్షాసనంలో నిలకడగా.. ఏకాగ్రతతో కనిపించింది. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu