తెలుగు దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ @ 40 ఏళ్ళు..

Sankarabharanam Completes 40 Years: ఎక్కడ.. పెద్దకళ్ళేపల్లి. ఎక్కడ తెలుగు సినీపాటకు పల్లకీ. రాలిపోయే పువ్వు మీద రాగాలు పలికించి, మాతృదేవతను పదాలతో అర్చించి.. తెలుగుప్రేక్షకుడి హృదయాన్ని కరుణరసంలో ముంచెత్తి..తెలుగుపాటకు జాతీయగౌరవం దక్కించిన ఘనాపాటి. అంతా తెలుగుపాట చేసుకున్న అదృష్టం కాక మరేమిటి…. అంతేనా, పిల్లనగోవికి ఒళ్లంతా గాయాలే.. అనిపించి….నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా… ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అని వర్ణనమాటేమిటి…. ఉచ్ఛ్వాస- నిశ్వాసములు వాయులీనాలని ప్రేక్షకులను ఓలలాడించిన సంగతేమిటి..? […]

తెలుగు దృశ్యకావ్యం 'శంకరాభరణం' @ 40 ఏళ్ళు..

Sankarabharanam Completes 40 Years: ఎక్కడ.. పెద్దకళ్ళేపల్లి. ఎక్కడ తెలుగు సినీపాటకు పల్లకీ. రాలిపోయే పువ్వు మీద రాగాలు పలికించి, మాతృదేవతను పదాలతో అర్చించి.. తెలుగుప్రేక్షకుడి హృదయాన్ని కరుణరసంలో ముంచెత్తి..తెలుగుపాటకు జాతీయగౌరవం దక్కించిన ఘనాపాటి. అంతా తెలుగుపాట చేసుకున్న అదృష్టం కాక మరేమిటి…. అంతేనా, పిల్లనగోవికి ఒళ్లంతా గాయాలే.. అనిపించి….నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా… ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అని వర్ణనమాటేమిటి…. ఉచ్ఛ్వాస- నిశ్వాసములు వాయులీనాలని ప్రేక్షకులను ఓలలాడించిన సంగతేమిటి..? ఇదంతా తెలుగుసినిమాకు పట్టిన తేనెపాటలపట్టు కాకుంటే… పాట- తెలుగుపాట… ఎన్నేసి కళలు పోయిందో… ఇంకెన్నీసి వొగలు వొలికించిందో తెలుగుప్రేక్షకుడికి సుపరిచితమే. ఒకటా రెండా వేలపాటలకు పదములిచ్చిన కలమది.

ఇంటిపేరు వేటూరి. ఒంటి పేరు సుందరరామమూర్తి, ఊరిపేరు పెదకళ్ళేపల్లి, పుట్టింది 1936, జనవరి 29. చదివింది మద్రాస్, విజయవాడ. తిరుపతి వెంకట కవులు, దైతాగోపాలం, మల్లాదిగార్ల దగ్గర శిష్యరికం.. ఆంధ్రప్రభలో ఉపసంపాదకత్వం.. కే. విశ్వనాధ్ తీసిన ఓ సీతకథతో సినీరంగ ప్రవేశం. ఆ తరువాత… చెప్పేదేముందీ ఎనిమిది నందులు. ఒక జాతీయగౌరవం దక్కించుకున్న పాటలకు పదాలద్దిన ఘనత వహించారు. . ఇదీ వేటూరికి చెందిన సంక్షిప్త సమాచారం. ఇవాళ ఆ మహానుభావుడి జయంతి..

వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేశారు. తెలుగు పాటలమ్మకి పట్టు చీరలు తొడిగించారు. పాటను పరవళ్లు తొక్కించారు. ఉరకలెత్తించారు. భాష భావుకతలు ఆయనకు రెండు కళ్లు. ఆయన సవ్యసాచి. ఆయన పాళికి రెండు వైపులా పదునే! మసాలాలు దట్టించి మాస్‌ను పట్టుకోగలరు. సంస్కృత సమాసాలు పట్టించి క్లాస్‌ను ఆకట్టుకోగలరు. తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలు అల్లిన సృజనశీలి. సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దిన పదశిల్పి. అసలు తెలుగు సినిమా పాటను కోటి రూపాయల స్థాయికి తీసుకెళ్లింది ఆయనే! ఆయనది ప్రత్యేకమైన శైలి. ఎవరికి అందని బంగారు పాళి. ఒక్కోసారి ఆయన మల్లాది అనిపిస్తారు.. సముద్రాలలా వినిపిస్తారు…పింగళిలా కనిపిస్తారు….కృష్ణశాస్త్రి పద పల్లవంలా వికసిస్తారు. శ్రీశ్రీలా మెరిపిస్తారు.. ఆత్రేయలా విలపిస్తారు.

పాటను సర్వాలంకారభూషితంగా తీర్చిదిద్దడంలో వేటూరి ఘనాపాటి. సరస సరాగాల సుమవాణిగా వినిపించడంలో ఆయనకు ఆయనేసాటి. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచిన మేటి! తేనెకన్నా తీయని తెలుగు నుడికారాలను మనకందించిన తేటి! కాలంతో పాటే పాట నడకను మార్చడంలో ఆయనకెవ్వరూ లేరు పోటి. ఏడో దశకంలో పిల్ల తెమ్మరలా ప్రవేశించి…చిరుగాలిలా చెలరేగి…ప్రభంజనమై వీచారు. వేటూరి పెన్ను చేయని విన్యాసం లేదు. రాయని భావ సౌందర్యం లేదు. సినిమా పాటకు కొత్త వగరునీ.. పొగరునీ …పరిమళాన్నీ తెచ్చింది వేటూరే! తన బాణీతో పాటకి వోణీలు వేయించీ తీయించిన గడుగ్గేయ చక్రవర్తి.

తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టకు రంగు రంగుల పూలిచ్చారు. కొమ్మకొమ్మకో కోటిరాగాలనిచ్చారు. తెలుగు వారి హృదయాల్లో మల్లెలు పూయించారు.. వెన్నెల కాయించారు. పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను అందంగా.. అలంకారంగా పొదిగిన ఆ పదశిల్పి నిజంగానే కారణజన్ముడు.. ఆయన వంటి కవి వెయ్యేళ్లకు కానీ పుట్టడు. ఈ సహాస్రాబ్దిలో పుడతారన్న నమ్మకం లేదు. ఆయన కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంటూ మోగుతూనే వుంటుంది…తెలుగువారి తనువు ఆ మంగళనాదంతో ఊగుతూనే వుంటుంది..

(శంకరాభరణం 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

-బాలు

Published On - 9:43 am, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu