మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే

మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే

దేశంలోని మహిళల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జన్‌ఔషధి దుకాణాల్లో రూ.2.50కు సువిధా బ్రాండ్‌తో ప్రభుత్వం విక్రయిస్తున్న శానిటరీ నాప్‌కిన్‌ల ధరను తగ్గించాలని నిర్ణయించింది. వాటిని ఇకపై ఒక్క రూపాయికే అందిస్తామని ప్రకటించింది. ఇక ఈ రేట్లు నిన్న అనగా మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. గతంలో నాలుగు న్యాప్‌కిన్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.10 గా ఉండేదని, ఇకపై కేవలం నాలుగు రూపాయలకే అందించనున్నట్లు కేంద్ర […]

Ravi Kiran

|

Aug 28, 2019 | 7:44 AM

దేశంలోని మహిళల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జన్‌ఔషధి దుకాణాల్లో రూ.2.50కు సువిధా బ్రాండ్‌తో ప్రభుత్వం విక్రయిస్తున్న శానిటరీ నాప్‌కిన్‌ల ధరను తగ్గించాలని నిర్ణయించింది. వాటిని ఇకపై ఒక్క రూపాయికే అందిస్తామని ప్రకటించింది. ఇక ఈ రేట్లు నిన్న అనగా మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. గతంలో నాలుగు న్యాప్‌కిన్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.10 గా ఉండేదని, ఇకపై కేవలం నాలుగు రూపాయలకే అందించనున్నట్లు కేంద్ర రసాయన, ఎరువులశాఖ సహాయమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. సువిధ బ్రాండ్ పేరుతో ఈ నాప్‌కిన్లు దేశవ్యాప్తంగా 5,500 జన్‌ఔషధి దుకాణాల్లో లభించనున్నాయి. కాగా ఈ కొత్త శానిటరీ నాప్‌కిన్లు పర్యావరణహితమైనవి.. వాడి పడేశాక భూమిలో త్వరగా కలిసిపోతాయని మంత్రి తెలిపారు.

మరోవైపు కేంద్రం గతేడాది మార్చిలోనే మహిళలకు ప్యాడ్లను తక్కువ ధరకే అందిస్తామని ప్రకటించింది. ఇక అవి మే నెలలో జన్‌ఔషధి కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ఏడాదిలో 2.2 కోట్ల నాప్‌కిన్ల అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలో రేటు మరింతగా తగ్గించటంతో అమ్మకాలు మరింతగా పెరుగుతాయని ప్రభుత్వం యోచిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu