“దయజేసి పత్రి విషయాన్ని రాజకీయం చెయ్యకండి”

షిర్డీ సాయి చుట్టూ మహారాష్ట్ర రాజకీయం నడుస్తోంది. సాయి జన్మస్థలం పత్రిని అభివృద్ధి చేయడానికి మహా సర్కార్‌ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీసాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ తప్పు పడుతోంది. ఈ వివాదాన్ని శివసేన, బీజేపీ పార్టీలు రెండూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. సాయి జన్మస్థలాన్ని నిర్ధారించలేరని ఒకరంటే, తగిన ఆధారాలున్నాయని మరొకరు అంటున్నారు. జన్మభూమి కంటే కర్మభూమి గొప్పదని ఒకరంటే , జన్మభూమిని అభివృద్ధి చేస్తే తప్పేముందని మరొకపార్టీ అంటోంది. ఈ ఇష్యూపై టీవీ9 స్పెషల్ డిబేట్ […]

దయజేసి పత్రి విషయాన్ని రాజకీయం చెయ్యకండి
Follow us

|

Updated on: Jan 18, 2020 | 7:21 PM

షిర్డీ సాయి చుట్టూ మహారాష్ట్ర రాజకీయం నడుస్తోంది. సాయి జన్మస్థలం పత్రిని అభివృద్ధి చేయడానికి మహా సర్కార్‌ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని షిరిడీసాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ తప్పు పడుతోంది. ఈ వివాదాన్ని శివసేన, బీజేపీ పార్టీలు రెండూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. సాయి జన్మస్థలాన్ని నిర్ధారించలేరని ఒకరంటే, తగిన ఆధారాలున్నాయని మరొకరు అంటున్నారు. జన్మభూమి కంటే కర్మభూమి గొప్పదని ఒకరంటే , జన్మభూమిని అభివృద్ధి చేస్తే తప్పేముందని మరొకపార్టీ అంటోంది. ఈ ఇష్యూపై టీవీ9 స్పెషల్ డిబేట్ నిర్వహించింది.

అయితే సాయి జన్మభూమి పత్రి అని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ఈ డిబేట్‌లో పాలుపంచుకున్న బీజేపీ నేత భాను ప్రకాశ్ ప్రశ్నించారు. మరో దేవాలయాన్ని నెలకొల్పి అభివృద్ది చేస్తే.. ఎటువంటి అభ్యంతరం లేదని, ఇలా మనోభావాలు దెబ్బతియడం మాత్రం కరెక్ట్ కాదన్నారు. అయితే శివసేన నేతలు మాత్రం ఆధారాలు ఉండబట్టే  ప్రభుత్వం ముందడగు వేస్తోందని చెప్పుకొచ్చారు.

ఇక ఇదే విషయంపై సినీ నటుడు, టీడీపీ నేత మురళిమోహన్ కూడా స్పందించారు. పత్రిలో కూడా దేవాలయాన్ని కట్టనివ్వాలని, తమకు నచ్చిన చోటుకు భక్తులు వెళ్తారని పేర్కొన్నారు. పత్రిని అభివృద్ది చెయ్యడం వల్ల షిర్డికి వచ్చే భక్తులు తగ్గిపోతారన్న ఊహాగానాలు కొట్టిపారేశారు. శివసేన, బీజేపీ ఈ విషయాన్ని రాజకీయం చెయ్యెద్దని అభ్యర్థించిన మురళి మోహన్ భక్తుల మనోభావాలను భంగపరచవద్దని హితవు పలికారు.