తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులుగా బతుకమ్మను పేర్చిన తెలంగాణ మహిళలు.. చివరి రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఒక్కొక్క పువ్వేసి.. చందమామా.. అంటూ బతుకమ్మ పాటలతో ఆడపడుచులు ఆడిపాడారు. అందంగా అలంకరించిన […]

తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 06, 2019 | 11:25 PM

తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు.

తొమ్మిది రోజులుగా బతుకమ్మను పేర్చిన తెలంగాణ మహిళలు.. చివరి రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఒక్కొక్క పువ్వేసి.. చందమామా.. అంటూ బతుకమ్మ పాటలతో ఆడపడుచులు ఆడిపాడారు. అందంగా అలంకరించిన బతుకమ్మను పూజించిన మహిళలు.. చెరువుల్లో, కాలువల్లో వాటిని వదిలిపెట్టారు. పోయి రా బతుకమ్మా అంటూ గౌరమ్మను తమ ఇంటికి తీసుకెళ్లారు.

హైదరాబాద్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలను పేర్చిన మహిళామణులు.. 30 అడుగుల బతుకమ్మ శకటంతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో సీఎం సతీమణి శోభ ముఖ్యఅతిథిగా పాల్గొనడం విశేషం. మంత్రులు, విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద బాణాసంచా కాల్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu